కచ్చితమైన గురితో తుపాకీ గుండ్లు పేల్చాలంటే అద్భుతమైన కంటి చూపు ఉండాలి.ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, షూటింగ్స్ స్కిల్స్ కూడా చాలా అవసరం.
అయితే ఇటీవల కజకిస్తాన్‌లో( Kazakhstan ) తన సాధారణమైన షూటింగ్స్ స్కిల్స్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు 92 ఏళ్ల చైనీయురాలు లీ గుయిఫాంగ్.( Li Guifang ) కొరియా యుద్ధంలో చైనీస్ పీపుల్స్ వాలంటీర్ ఆర్మీలో ఆమె పనిచేశారు.
కుడి కంటిలో శుక్లం ఏర్పడటం వల్ల ఆమె హాఫ్ బ్లైండ్( Half Blind ) వృద్ధురాలిగా ఉన్నారు.సగం కనిపించకపోయినా, బుల్లెట్లు కాల్చడంలో కంటి చూపు ఉన్న వారితో సమానంగా ఇచ్చారు.
తన కుమారుడు వాంగ్‌తో కలిసి కజకిస్తాన్‌కు వెళ్లిన లీ, ఫైరింగ్ చేయాలని అనుకున్నారు.ఆమె వయస్సు ఎక్కువ అని మొదట రేంజ్ స్టాఫ్ అనుమతించలేదు.కానీ ఆమె యుద్ధ వీరులు అని తెలిసి, తక్కువ పవర్ ఉన్న చిన్న బోర్ రైఫిల్‌ను ఇచ్చి, ఆమెకు లక్ష్యం సాధించడానికి సహాయపడే సాధనాన్ని అమర్చి, కాల్పులు చేయడానికి అనుమతించారు.
కేవలం ఎడమ కంటితో చూస్తూ లీ 97 పాయింట్లు సాధించారు.10 వలయాల లక్ష్యంలో ఏడు బుల్లెట్లు అంతర్గత వలయంలోనూ, మూడు బుల్లెట్లు బాహ్య వలయంలోనూ తగిలాయి.ఆమె కొడుకు వాంగ్, లీ తుపాకీ పేల్చుతున్న వీడియోను చైనాలోని( China ) టిక్‌టాక్‌లాంటి యాప్ డౌయిన్‌లో పోస్ట్ చేశాడు.
ఆ వీడియోకు 5 లక్షల కంటే ఎక్కువ లైక్‌లు, 20,000 కామెంట్లు వచ్చాయి.
మరో రౌండ్‌లో, లీ 87 పాయింట్లు సాధించారు.“ఇతరుల కంటే ఆమెకు కష్టం.కానీ ఆమె తన మొత్తం శ్రద్ధను పనిపై కేంద్రీకరించడం ద్వారా చాలా బాగా చేసింది” అని వాంగ్ చెప్పారు.
కొరియా యుద్ధ సమయంలో లీ చైనీస్ సైన్యంలో సిగ్నలర్‌గా పనిచేశారు.ఆమె కాల్పులు చేయడం నేర్చుకున్నప్పటికీ, యుద్ధభూమిలో పాల్గొనలేదు.
ఆమెకు నేర్పించిన ప్రతి విషయం ఆమెకు ఇప్పటికీ గుర్తుందని, మళ్లీ కాల్పులు చేయాలని కోరుకుంటుందని ఆమె కొడుకు వాంగ్ చెప్పాడు.కాల్పులు చేయడంతో పాటు, లీకి ప్రయాణం చేయడం చాలా ఇష్టం.
ఆమె 60 కంటే ఎక్కువ దేశాలను సందర్శించింది, స్కైడైవింగ్ వంటి యాక్టివిటీస్‌లో పాల్గొంటుంది.