పసుపు దంతాలను తెల్లగా మెరిపించే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

సాధారణంగా కొందరి దంతాలు పసుపు రంగులో చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి.దంతాల సంరక్షణ లేకపోవడం, కాఫీ, టీ, రెడ్ వైన్, బెర్రీలు, సోయా సాస్ మరియు ఇతర ముదురు రంగు ఆహారాలను అతిగా తీసుకోవడం, ధూమపానం, ఇతర పొగాకు వాడకం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి.

 This Is A Simple And Effective Remedy To Whiten Yellow Teeth Details, Yellow Te-TeluguStop.com

ఇటువంటి దంతాలు కలిగిన వారు ఇతరులతో మాట్లాడే సమయంలో తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

పసుపు దంతాలను( Yellow Teeth ) ఎలాగైనా తెల్లగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీ సింపుల్ గా ఉన్న చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

పసుపు దంతాలను తెల్లగా మెరిపిస్తుంది.మరి లేటెందుకు రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Banana Peel, Remedy, Latest, Salt, Shiny Teeth, Simple Remedy, Teeth, Tee

ముందుగా అరటిపండు తొక్కను( Banana Peel ) తీసుకుని లోపలి వైపు ఉండే తెల్లటి భాగాన్ని స్పూన్ సహాయంతో సపరేట్ చేసుకొని ఒక బౌల్ లోకి వేసుకోండి.ఈ వైట్ స్టార్చ్ లో ఉండే పలు రకాల మినరల్స్ దంతాలపై పసుపు మరకలు వదిలించడానికి సహాయపడతాయి.ఇప్పుడు ఈ బ‌నానా పీల్ స్టార్ట్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మరియు వన్ టీ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ లేదా మీ రెగ్యులర్ టూత్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను బ్రష్ తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా తోముకోవాలి.

Telugu Banana Peel, Remedy, Latest, Salt, Shiny Teeth, Simple Remedy, Teeth, Tee

ఆపై వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా రోజుకు ఒకసారి కనుక చేస్తే అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది.లెమన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది దంతాలను తెల్లగా మార్చడానికి ఒక న్యాచురల్ ఏజెంట్ మాదిరి పని చేస్తుంది.మరియు సాల్ట్ దంతాలపై మరకలను తొలగిస్తుంది.

కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని కనుక పాటిస్తే పసుపు దంతాలకు గుడ్ బై చెప్పవచ్చు.దంతాలను తెల్లగా అందంగా మెరిపించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube