యువ నటుడు మౌళి( Actor Mouli ) గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.ఇతను #90s వెబ్ సీరిస్‌తో( #90s Web Series ) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఇతనిపై వైసీపీ బూతు మాఫియా తమ గురి ఎక్కు పెట్టింది.ఆయన చేసిన పాపం రాజధానిని మాయం చేయడం.
అయితే స్టేజ్ ఎక్కితే నలుగుర్ని నవ్వించడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మౌళి,ఇటీవల ఒక కార్యక్రమంలో రాజధానిని మాయం చేశానని జోక్ వేశాడు.అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దాంతో వెంటనే వైసీపీ( YCP ) బూతు మాఫియా తమ బూతుల ఆయుధాలతో రంగంలోకి దిగిపోయింది.

మౌళినే కాదు ఆయన అమ్మా, నాన్నలను కూడా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం ప్రారంభించారు.మౌళి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు.దీంతో వైసీపీ దెబ్బకు భయపడి పోయిన మౌళి సారీ చెబుతూ ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.
తన తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు.తాను ఒక జోక్ మాత్రమే వేశానని స్పష్టం చేశారు.
ప్రజల్ని నవ్వించడమే తన గోల్ అని రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు.మౌళి.
అయితే మౌళి సోషల్ మీడియా ప్రకటనతో వైసీపీ బూతు మాఫియా ఎంతకైనా తెగిస్తుందని అర్థమయిందన్న విమర్శలు వస్తున్నాయి.

ఏపీ రాజధాని( AP Capital ) ఏది అనేది వైసీపీ వాళ్లు కూడా చెప్పరు చెప్పలేరు.ఉన్న నిజాన్ని జోకులుగా చెప్పినా వైసీపీ వాళ్లకు కోపం వస్తుంది.అయినా వైసీపీ నేతలకు ఎదురుదాడి అంటే బూతులే అన్నట్లుగా మారిపోయింది అంటూ చాలామంది వైసీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయినా అతను మాట్లాడిన దాంట్లో తప్పేముంది నిజమే కదా మాట్లాడాడు నిజం మాట్లాడితే మీకు కోపం వచ్చిందా అంటూ వైసీపీ నేతలపై ప్రజలు మండిపడుతున్నారు.







