గ్రీన్‌ ఎనర్జీ హబ్‌ కోసం పనిచేయనున్న 9 యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు.. విశేషాలివే!

అవును, 9 యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు( 9 European Union countries ) మధ్యధరా ప్రాంతంలో గ్రీన్‌ ఎనర్జీ హబ్‌ కోసం ఓ ప్రతిపాదనను ప్రవేశ పెట్టడం జరిగింది.ఈ నేపథ్యంలో గ్రీస్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, స్పెయిన్‌, సాల్వేనియా, క్రొయేషియా, సైప్రస్‌, మాల్టాలు ఎంఇడి 9 కూటమిగా ఏర్పడడం జరిగింది.

 9 European Union Countries Will Work For Green Energy Hub, 9 European Union Coun-TeluguStop.com

మాల్టా రాజధాని వలెట్టాలో గురువారం జరిగిన సమావేశంలో ఈ 9 దేశాల విద్యుత్‌ మంత్రులు ఉమ్మడి ప్రతిపాదనపై సంతకం చేయడం జరిగింది.ఈ కూటమి ప్రస్తుతం మీడియా సర్కిల్ లో హాట్ టాపిక్ అవుతుంది.

ఈ కూటమి లక్ష్యం ఏమంటే, దక్షిణ యూరప్‌( Southern Europe ) ప్రాంతంలో పునరుత్పాదక విద్యుత్‌ కోసం పెట్టుబడులను ప్రోత్సహించడం, తద్వారా వృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ 9 దేశాలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి.ఈ కూటమి పునరుత్పాదక ఇంధన వనరులు, పునరుత్పాదక హైడ్రోజన్‌ ఉత్పత్తి, సౌర విద్యుత్‌ (పివి) వ్యవస్థలు, రవాణా, నిల్వ చేపట్టనున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌( European Union ) (ఇయు) దేశాలతో పాటు ఇయులోకి రాని మధ్యధరా దేశాలకు సంబంధాలను ఏర్పరచనుంది.

ఈ నేపథ్యంలో… ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి మాల్టాలోని పర్యావరణం, ఇంధనం మంత్రి అయినటువంటి ‘మిరియం డల్లి’ అధ్యక్షత వహించారు.ఇక ఈ కార్యక్రమంనికి ఇయు ఎనర్జీ కమిషనర్‌ కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా మిరియం డల్లి( Miriam Dally ) మాట్లాడుతూ… “పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పాదకత కోసం పెట్టుబడులు వంటి దీర్ఘకాల లక్ష్యాలతో ముందుకు సాగడమే ధ్యేయంగా, ప్రస్తుత సవాళ్లకు ఉత్తమ పరిష్కారంగా భావించాలి.” అని ఈ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube