అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) 9/11 దాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు.టక్కర్ కార్ల్‌సన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ 9/11 దాడులు, ప్రభుత్వ పారదర్శకత, ప్రభుత్వం-ప్రజల మధ్య విశ్వాసం క్షీణించడం వంటి వివాదాస్పద అంశాలపై చర్చించారు.
9/11 దాడుల గురించి అమెరికా ప్రభుత్వం సూటిగా చెప్పలేదని, ఫెడరల్ బ్యూరోక్రసీలు అబద్ధాలు చెప్పాయని రామస్వామి తన అభిప్రాయాలను పునరుద్ఘాటించారు.9/11 కమీషన్( 9/11 Commission ) అబద్ధం చెప్పిందని.ఎఫ్‌బీఐ( FBI ) అబద్ధం చెప్పిందని రామస్వామి పేర్కొన్నాడు.
అసహ్యకరమైన నిజాలు మాట్లాడటం తరచుగా తీవ్ర వ్యతిరేకతను ఆకర్షిస్తుందని రామస్వామి చెప్పారు.ప్రస్తుతం దేశంలో ద్వైపాక్షిక ఏకాభిప్రాయం వుందని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ 19 మూలాలు, వ్యాక్సిన్, జనవరి 6వ తేదీన జరిగిన క్యాపిటల్ సంఘటనలతో సహా వివిధ అంశాలను రామస్వామి హైలైట్ చేశారు.అలాగే హంటర్ బైడెన్( Hunter Biden ) వ్యవహారాలు, నాష్‌విల్లే షూటింగ్, క్రిస్టియన్ స్కూల్‌లో కాల్పుల వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు.
ఇకపోతే.ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మాస్క్( Elon Musk ) వివేకా రామస్వామికి ఒకే రోజు రెండోసారి ఆమోదం తెలిపారు.ఇప్పటికే వివేక్ ఖచ్చితంగా రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున అధ్యక్ష అభ్యర్ధి అవుతారని మస్క్ చెప్పారు.
తాజాగా మరోసారి రామస్వామి అభిప్రాయాలను పరోక్షంగా ఆమోదించారు టెస్లా అధినేత.రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ రేసులో తన ప్రత్యర్ధి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌తో తలపడటానికి ఒక వారం ముందు మస్క్ నుంచి ఈ ఆమోదం లభించడం విశేషం.
కాగా.2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన( World Trade Center ) బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్ని చరిత్ర మరవలేదు.అత్యంత శక్తివంతమైన అమెరికాపై ఉగ్రదాడితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి.
సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు.న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం, జూన్ 2019 నాటికి అగ్నిమాపక దళ సిబ్బంది మరియు పోలీసులు సహా రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మరణించారు.
రెండు భవనాల్లో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు.ఇంకా పెంటగాన్ భవనంపై( Pentagon ) జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు.మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే.
వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.దీంతో బిన్‌లాడెన్, అల్‌ఖైదాలపై పగబట్టిన అమెరికా.
ఆఫ్ఘన్ గడ్డపై దిగి భీకర దాడులు చేసింది.పదేళ్ల పాటు నింగీ, నేల, పాతాళంలో గాలించి పాక్‌లోని అబోట్టాబాద్‌లో లాడెన్‌ను హతమార్చింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy