జైలు లో కరోనా కలకలం,ఏకంగా 60 మంది...

కరోనా మహమ్మారి రాజు,పేద అన్న ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తుంది.దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఈ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.

తాజాగా గుజరాత్ లోని వడోదర జైలు లో కూడా ఈ కరోనా కలకలం సృష్టించింది.జైలు లో ఉన్న ఖైదీలలో దాదాపు 60 మంది ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.

కనీసం 1000 మంది ఖైదీలు ఉండే ఈ జైలు లో 60 మందికి కరోనా పాజిటివ్ రావడం తో అధికారులు వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు.ఇప్పటివరకు 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 17 మంది లక్షణాల తో కూడిన వైరస్ సోకగా, మరో 43 మందికి మాత్రం ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో ప్రస్తుతం జైలు లోనే 80 పడకల తో కూడిన కోవిడ్-19 సెంటర్ ను ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం జైలు లో ఆరుగురు వైద్యుల సమక్షంలో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 56,874 కరోనా కేసులు నమోదు కాగా,2,438 కోవిడ్-19 మరణాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.సోమవారం వడోదర లో మొత్తం 80 కేసులు నమోదు కాగా, అందులో 43 కేసులు ఈ జైలు లోనే నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

అంతేకాకుండా సోమవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదు అయినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు