కరోనా రావడం పాపం కాదు... సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణ చర్యలు, పరిస్థితుల గురించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.సీఎం జగన్ రాష్ట్రంలో కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేస్తున్నారని అన్నారు.

 Ap Cm Ys Jagan, Corona Virus, Covid-19, Ap Cm Jagan Sensational Comments On Coro-TeluguStop.com

కరోనా లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పులు చేయలేదని… లెక్కలను తక్కువ చేసి చూపలేదని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకు 31వేలకు పైగా కరోనా పరీక్షలు జరిపిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని తెలిపారు.

ఎక్కువ కేసులు నమోదైతే సంఖ్యను తగ్గించి తక్కువగా చూపే ప్రయత్నాలు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయని ఏపీలో అలాంటి పరిస్థితి లేదని అన్నారు.కోవిడ్ క్లస్టర్లలోనే 90 శాతం పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు.దేశంలో మరణాల రేటు 2.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో ఆ రేటును 1.06 శాతానికి పరిమితం చేశామని అన్నారు.

కరోనా రావడం నేరం, పాపం కాదని… ఎవరైతే కరోనాతో చనిపోతే వాళ్లలో కొన్ని గంటల తర్వాత వైరస్ ఉండదని.

కరోనా సోకిన బంధువులు చనిపోతే వాళ్లకు అంత్యక్రియలు కూడా చేయలేకపోవడం విచారకరం అని చెప్పారు.కరోనా వల్ల చనిపోయిన వాళ్ల అంత్యక్రియలకు ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇస్తోందని అన్నారు.

కరోనాపై అవగాహన పెంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలని సీఎం జగన్ సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube