కేవలం అబ్బాయిలే అమ్మాయిలని ఇష్టపడతారా? అలాంటి రూల్ ఏం లేదు.ఒక జెండర్ వారికి అవతలి జెండర్ మీద ఆకర్షణ, ఇష్టం కలగటం చాలా సహజమైన విషయం.
ఇందులో అబ్బాయిలు మాత్రమే చూడగలిగే దృష్టికోణం ఏమి లేదు.ఉన్న తేడా ఏమిటంటే, అబ్బాయిలు తమ ఫీలింగ్స్ ని అస్సలు దాచుకోలేరు.
వెంటనే లేదా పెద్దగా ఓపిక పట్టుకుండానే బయటపెట్టేస్తారు.కాని అమ్మాయిలు అలా కాదు.
వారి మనసులో ఏముందో, మెదడులో ఏముందో మరో అమ్మాయి కూడా కనిపెట్టడం కష్టం.అలాంటిది అబ్బాయిలకెలా అర్థమవుతారు.
కాని ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ఇష్టపడితే, కావాలనో, అనుకోకుండానో, చిన్న చిన్న సంకేతాలు పంపిస్తుంది.అవేంటో మీరే చూడండి.
* అమ్మాయిలు ఇక అబ్బాయిని నిజంగానే ఇష్టపడితే చాలా సందర్భాల్లో తన స్నేహితురాళ్ళకి చెప్పుకుంటారు.అదే జరిగితే, అబ్బాయి కనబడగానే అమ్మాయి స్నేహితులు తనని ఆటపట్టించడం కోసం కాస్త వింతగా ప్రవర్తిస్తారు.
అంటే అబ్బాయి పేరు తీయడం, అమ్మాయిని గిల్లడం, మొత్తానికి అబ్బాయి కనబడగానే ఆటపట్టించడం మొదలుపెడతారు.
* ఇష్టపడిన అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది అమ్మాయి.
అందుకే ఎప్పుడు లేనట్టుగా, కొత్తగా సాధ్యమైనన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.అబ్బాయి ఇష్టాలు ఏంటి, సరదాలు ఏంటి, జీవిత లక్ష్యాలు ఏంటి, తనకి ఇంకో అమ్మాయి మీద ఇష్టం ఏమైనా ఉందా ? ఇలాంటివన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
* తను మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది.అదేదో చెప్పలేం .అంతా కొత్తగా ఉంటుంది.మాటలు కూడా కొత్తగా ఉంటాయి.
చిన్నిపాటి గౌరవం కూడా కలిపి మాట్లాడుతుంది.
* గుంపులో కూడా మీతో ఉండేందుకు ప్రయత్నిస్తుంది.
పక్కనే కూర్చునేందుకు కూడా మొహమాటపడదు.అలాగని అందరికి దొరికేలా ప్రవర్తించదు.
కాని మీకు మాత్రం తెలిసిపోతుంది.
* మాటల్లో తడబాటు ఉంటుంది.
కొంచెం భయంగా కూడా మాట్లాడుతుంది.అలాగే మీరేం చెప్పిన, మొదట రెస్పాండ్ అయ్యే వ్యక్తి తనే.సడెన్ గా మీ విషయాలన్నిటిలోకి తలదూరుస్తుంది.
* మాటల్లో లేని ధైర్యం మెసెజ్లలో చూపిస్తుంది.
చిన్నపాటిగా ఫ్లర్ట్ కూడా చేస్తుంది.మీతో గంటలు గంటలు మాట్లాడినా తనకి బోర్ కొట్టదు.
వీలైనంత సమయం మీతోనే గడిపేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది.