పెట్రోల్ బంకులో( petrol station ) పెట్రోల్ ఒక్కటే కాదు అదనంగా ఆరు ఉచిత సర్వీసులు అందుబాటులో ఉంటాయి.వీటి గురించి ఎంతమందికి అవగాహన ఉందో తెలియాల్సి ఉంది.
పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించే టైం లో ఈ ఉచిత సర్వీసులు( Free services ) అందించకపోతే ఎవరైనా సరే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.ఇంతకీ అసలు పెట్రోల్ బంకులో అందుబాటులో ఉండాల్సిన సర్వీసులు ఏంటి అంటే అందులో మొదటిది మూత్ర శాలలు, మరుగు దొడ్లు.
స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పెట్రోల్ బంకులో ఇవి మూత్రశాలలు ఉండాల్సిందే.రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబందించిన ఆదేశాలు జారీ చేసింది.

మనం కొట్టించే ప్రతి లీటర్ పెట్రోల్ పై 4 నుంచి 8 పైసలు ఈ మూత్రశాలలు, మరుగుదొడ్లు కోసం బంక్( Bunk ) యజమానులకు వెళ్తుంటాయి.ఇక పెట్రోల్ కానీ డీజిల్ కానీ కల్తీ( Kalti ) జరుగుతుందని అనుమానం వస్తే నాణ్యత తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.పెట్రోల్ బంకులో టూ వీలర్, త్రీ, ఫోర్ వీలర్ ఏ వెహికల్ కి అయినా ఫ్రీగా గాలి నింపాల్సిందే.పెట్రోల్ బంకులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి.
ఎవరైనా గాయంతో వస్తే ఫస్ట్ ఎయిడ్ చేయాల్సి ఉంటుంది.ఇక అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఫోన్ చేయాల్సి వస్తే పెట్రోల్ బంకులో ఉన్న ఫోన్ వాడుకోవచ్చు.
ఇలా ఆరు ఉచిత సర్వీసులను పెట్రోల్ బంకులో ఇస్తారు.అయితే వీటిలో ఏవి మనం వాడుకుంటున్నాం అన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది.







