ఇటీవలే దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలకు వేలం ప్రక్రియ ముగిసింది.భారీ ధరకు వేలంలో ప్రముఖ కంపెనీలు బిడ్డింగ్ దక్కించుకున్నాయి.
ఆగస్టు చివరి నాటికి ఎయిర్‌వేవ్‌లను కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.దీంతో మూడు ప్రైవేట్ సెక్టార్ క్యారియర్లు కొన్ని సర్కిళ్లలో అక్టోబర్ ప్రారంభంలో 5G సేవలను ప్రారంభించవచ్చని టెల్కోల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.
ఆపరేటర్‌లు ఇప్పటికే నెట్‌వర్క్ పరీక్షలు మరియు ట్రయల్స్‌ను నిర్వహించిన నగరాలతో ప్రారంభించాలని భావిస్తున్నారు.దేశంలోని త్వరలో కొన్ని నగరాలలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంటే 4జీ కంటే 10 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలను కీలక నగరాలలోని ప్రజలు పొందుతారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
దేశంలో అన్నిటికంటే ముందుగా 13 ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5G ఇంటర్నెట్ సేవలను వివిధ కంపెనీలు ప్రారంభించనున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, జామ్ నగర్, చెన్నై, గాంధీనగర్, లక్నో, పుణె, గురుగ్రామ్ నగరాలలో తొలుత 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇక ముంబై, ఢిల్లీ, జామ్‌నగర్, చెన్నై మరియు బెంగళూరు సహా తొమ్మిది ప్రాంతాల్లో జియో ఇన్ఫోకామ్ పరీక్షలు నిర్వహించింది.తాము కూడా దేశంలోని ప్రతి ప్రాంతంలో 5G సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ మీడియా ప్రకటనలో తెలిపింది.
అన్నిటికంటే ముందుగా వొడాఫోన్ ఐడియా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే తన కస్టమర్లకు దీనిపై మెసేజ్‌లను పంపుతోంది.5జీ సేవలు మీరు పొందుకోవాలంటే ముందుగా మీ స్మార్ట్ ఫోన్లలో కొన్ని సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి.అందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, వైఫ్ నెట్‌వర్క్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత మొబైల్ నెట్‌వర్క్స్‌పై క్లిక్ చేసి, నెట్‌వర్క్ మోడ్ సెలెక్ట్ చేయాలి.ఆ తర్వాత ‘ప్రిఫర్డ్ నెట్‌వర్క్ టైప్’ ఎంచుకుంటే మీకు 2జీ, 3జీ, 4జీ, 5జీ అని ఆప్షన్స్ కనిపిస్తాయి.
అలా మీ ఫోన్‌లో ఉంటే మీకు 5జీ సేవలు అందుతాయి.







