ఆగస్టు 15 నుండి కిలో టమాటా 50 రూపాయలే కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశం..!!

దేశవ్యాప్తంగా గత నెల రోజులకు పైగా కిలో టమాట ధర( Tomato Price ) ₹150 రూపాయలకు పైగా ఉంది.

దీంతో సామాన్యులు టమాటాలు కొనలేని పరిస్థితి నెలకొంది.

ఊహించని విధంగా టమాటా ధరలు పెరగటంతో దేశవ్యాప్తంగా చాలామంది టమాటా రైతులు( Tomato Farmers ) ఇటీవల భారీ లాభాలు అందుకోవడం జరిగింది.అయితే 150 రూపాయలకు పైగా కిలో టమాట ధర పెరుగుటంతో.

చాలా చోట్ల టమాటా లోడ్ వాహనాలు చోరీకి కూడా గురయ్యాయి.టమాటాల కోసం కొట్టుకున్న పరిస్థితి దేశంలో ఏర్పడింది.

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఆగస్టు 15 నుండి దేశంలో కిలో టమాట 50 రూపాయలకే అమ్మాలని సరికొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది.₹50 రిటైల్ ధరకు టమాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది.ఈ మేరకు సోమవారం నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని ఆదేశించింది.

Advertisement

ఢిల్లీలో కొన్ని ప్రాంతాలలో ఆగస్టు 14 నుండే టమాట రిటైల్ విక్రయాలు ప్రారంభమయ్యాయి.ఒక్కసారిగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు తగ్గించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తన రెమ్యునరేషన్ గురించి వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు