వర్షాకాలంలో ఇండియాలో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్లేసెస్..!

భారతదేశం విభిన్న ప్రకృతి ప్రదేశాలతో అందమైన దేశంగా నిలుస్తోంది.వర్షాకాలం( Monsoon ) వీటికి మరింత ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడుతుంది.

ఈ సమయంలో ఆ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తే వచ్చే అనుభూతే వేరు.ముఖ్యంగా ఐదు ప్రాంతాలు ప్రజలకు మరపురాని జ్ఞాపకాలను మిగుల్చుతాయి.

అవేవో చూసేద్దామా మరి.

• జిరో వ్యాలీ:

అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో వ్యాలీ (Ziro Valley) వర్షాకాలంలో ఒక స్వర్గధామంగా మారుతుంది.అక్కడి పచ్చదనం, వెదురు అడవులు, టెర్రస్డ్ వరి పొలాలు మంత్రముగ్దుల్ని చేస్తాయి.పర్యాటకులు చిరుతపులి వంటి వన్యప్రాణులను చూడటానికి సమీపంలోని టాలీ వన్యప్రాణుల అభయారణ్యానికి కూడా వెళ్లవచ్చు.

• అతిరాపల్లి:

Advertisement

కేరళలోని అతిరాపల్లి జలపాతాన్ని (Athirapally Falls) "భారతదేశ నయాగరా" అని పిలుస్తారు.దట్టమైన అడవుల నడుమ ఉన్న ఈ అద్భుతమైన జలపాతం ఒక ప్రకృతి అద్భుతం.సందర్శకులు ఈ ప్రాంతంలో చిరుతపులులు, ఏనుగులు వంటి అడవి జంతువులను కూడా చూడవచ్చు.

• డ్జుకౌ వ్యాలీ:

నాగాలాండ్-మణిపూర్ సరిహద్దులో ఉన్న డ్జుకౌ లోయ (Dzükou Valley)ను "వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్" అని కూడా అంటారు.ఇది వర్షాకాలంలో పచ్చదనాన్ని చీర కట్టుకుంటుంది.ఈ ప్రదేశం వికసించే పూలతో అద్భుత టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుతుంది.

ట్రెక్కింగ్‌కు కూడా బెస్ట్ ప్లేస్‌గా ఉంటుంది.

• చిరపుంజి:

మేఘాలయలోని చిరపుంజి (Cherrapunji)లో వర్షాకాలం అంతటా భారీ వానలు కురుస్తాయి.అందుకే ఆ కాలంలో చిరపుంజి పచ్చదనం కప్పుకుని ఉంటుంది.అలానే భూమిపై అత్యంత తేమగా ఉండే ప్రదేశాలలో ఒకటిగా మారుతుంది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?

ఇది చెట్ల వేర్లు, అద్భుతమైన నోహ్కాలికై జలపాతం, జీవన రూట్ వంతెనలను కలిగి ఉంది.

• అగుంబే:

Advertisement

కర్నాటకలోని అగుంబే (Agumbe) ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అడవులు, భారీ జలపాతాలకు నెలవు.ఇది జీవవైవిధ్యంతో ఉంటుంది.ప్రకృతి అందాలను అన్వేషించడానికి గొప్ప ప్రదేశంగా నిలుస్తుంది.

తాజా వార్తలు