తెలంగాణలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల నగార మోగనుంది.వచ్చే ఏడాది మార్చి నెలలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటా కింద 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవ్వనున్నాయి.
ఈ పోస్టులను దక్కించుకోవడానికి దాదాపు 30 మంది పోటీ చేయనున్నారు.ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్న నేపథ్యంలో ఇప్పటికే పైరవీలు షురూ అయ్యాయి.
ఈ పోస్టుల భర్తీపై గతంలో సీఎం కేసీఆర్ చాలా మందికి హామీలు కూడా ఇచ్చారు.అలాగే పార్టీలో కొత్తగా చేరిన నాయకులకు కూడా హామీ ఇచ్చారు.
దీంతో ఈ పదవులు ఎవరికి దక్కుతాయనే విషయంపై టెన్షన్ మొదలైంది.
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో కొనసాగుతున్న గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణా రెడ్డి, నవీన్ కుమార్, అలాగే గవర్నర్ కోటాలో కొనసాగుతున్న ఫారూక్ హుస్సేన్, రాజేశ్వర రావుల పదవి కాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది.
అయితే ఈ పదవులను ఎవరెవరికి కేటాయిస్తారనే విషయం తెలియదు.దీంతో చాలా మంది తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.వీరితోపాటు కొత్తగా పార్టీలో చేరిన లీడర్ల సైతం ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు.ఒక వేళ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.అయితే ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవి కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ సారి పార్టీ టికెట్ ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు ఇనుగాల పెద్ది రెడ్డి, మోత్కుపల్లి నర్సింలు, మండవ వెంకటేశ్వరరావు కూడా ఈ రేసులో ఉన్నారు.అలాగే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి పదవులు దక్కని క్యామా మల్లేశం, మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన రాజశేఖర రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, తీగల కృష్ణా రెడ్డి, నాగేందర్ గౌడ్, రామ్మోహన్ గౌడ్, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, తదితరులు ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు.అలాగే ఈ సారి తనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.