లేటు వయసులో హీరోయిన్ ఘాటు రోమాన్స్

1997వ సంవత్సరంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మాజీ ప్రపంచ సుందరీ ఐశ్వర్యరాయ్.అప్పటికి హీరో రణబీర్ కపూర్ వయసు పట్టుమని పదహారు ఏళ్ళు కూడా లేవు.

కట్ చేస్తే ఇది 2016.19 ఏళ్ళు గడిచిపోయాయి.ఇప్పుడు అదే రణబీర్ కపూర్ ఐశ్వర్యరాయ్ తో రొమాన్స్ చేస్తున్నాడు.

అది కూడా ఘాటైన రొమాన్స్.

కరణ్ జోహర్ దర్శకత్వంలో రణబీర్ హీరోగా నటించిన చిత్రం ఏయ్ దిల్ హై ముష్కిల్.ఇందులో రణబీర్ సరసన ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ కథానాయికలుగా నటించారు.ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రచారచిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.

నాలుగు పదుల వయసు దాటినా, ఐష్ అందంలో, అభినయంలో ఏమాత్రం మార్పు లేదు.ఆ టీజర్ లో 42 ఏళ్ళ ఐశ్వర్యరాయ్ తన జూనియర్ రణబీర్ కపూర్ మంచి రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది.

ఇప్పుడు బాలివుడ్ మొత్తం ఐశ్వర్యరాయ్ - రణబీర్ కపూర్ మధ్య నడిచిన కెమిస్ట్రీ మీదే చర్చించుకుంటోంది.సినిమా ఎలా ఉండబోతోందో కాని, టీజర్ లో చూపించిన రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం జనాలని థియేటర్లకు రప్పించడం ఖాయం.

Advertisement
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తాజా వార్తలు