కర్నూల్ లో మహిళకు దొరికిన 4 క్యారెట్ల వజ్రం..!

ఏపీలోని కర్నూలు జిల్లాలో గత కొద్దీ నెలల నుండి వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది.ఇక వర్షాకాలంలో ఈ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల కోసం వెతుకుంటారు.

 Kadapa, Diamond, Found, Woman-TeluguStop.com

అయితే కర్నూల్ జిల్లాలోని తుగ్గలి ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి.ఆ ప్రాంతంలోని భూముల్లో వజ్రాలు బాగా దొరుకుతాయి.

దీంతో ఆ ప్రాంతంలో జీవనం సాగించే ప్రజలంతా అదే పనిగా వజ్రాల కోసం వెతుకుతుంటారు.ఒక్క వజ్రం దొరికితే లక్షాదికారి కావొచ్చు అనే ఆశతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అయితే ఓ మహిళ పొలం పనులు చేస్తుండంగా ఆమెకు 4 క్యారెట్ల వజ్రం దొరికింది.ఆమె ఆ వజ్రాన్ని రూ.3.5 లక్షలకు ఓ వ్యాపారికి అమ్మినట్లు సమాచారం.ఇకపోతే నాలుగు నెలల సమయంలో ముగ్గురికి వజ్రాలు దొరకడం మాత్రం విశేషం.

అయితే ఆ ప్రాంతంలో వజ్రాలు దొరకడం కొత్తేమి కాదు.

ఇక ప్రతి సంవత్సరం తొలకరి తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల వేట కొనసాగిస్తారు.ఇక మరికొంత మంది స్థానికులు, రైతులు పొలాల్లో వజ్రాలను వెతకటంలో బిజీ అవుతుంటారు.

అయితే గత కొద్దీరోజులుగా వర్షాలు కురవడంతో వజ్రాలు పొలాల్లో పైకి వస్తున్నాయి.ఇక ఇప్పటికే అనంతపురం జిల్లాలో కొంత మందికి వజ్రాలు లభించాయి.

వాటిని వారు ఎవరికీ తెలియకుండా వ్యాపారులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube