న్యూయార్క్ : చెప్పినా వినలేదు, ఇక యాక్షన్‌లోకి.. వ్యాక్సిన్ తీసుకోని 3 వేల మంది ఉద్యోగులపై వేటు..?

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వైరస్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ ఛిన్నాభిన్నమైంది.

కోవిడ్ తగ్గుముఖం పట్టిందని భావించేలోపు కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి మరింత బలం పుంజుకుని కొరడా ఝళిపిస్తోంది.ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ అనేక దేశాల్లో మరణ మృదంగాన్ని మోగిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రజలను రక్షించుకోవాలంటే వున్న ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సినేషన్.ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.కొందరు ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు వేసుకుంటుంటే.

Advertisement

కొన్నిచోట్ల మాత్రం ససేమిరా అంటుండటంతో ప్రభుత్వం సైతం కఠినంగానే వ్యవహరిస్తోంది.ఈ నిర్బంధ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొన్ని చోట్ల ఆందోళనలకు దారి తీసింది.

ప్రస్తుతం కెనడాలో ట్రక్కర్ల ఆందోళన ఇందులో భాగమే.ఈ నేపథ్యంలో న్యూయార్క్ నగర అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్ తీసుకోని దాదాపు 3 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది.నగరంలోని పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ కార్మికులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని గతేడాది అప్పటి న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో ఆదేశాలు జారీ చేశారు.

వీటిని అతిక్రమించిన వారిని వేతనం లేని సెలవులో పంపుతామని మేయర్ హెచ్చరించారు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

అయితే అప్పట్లోనే ఈ నిర్ణయంపై న్యూయార్క్ పోలీస్ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఇదిలావుండగానే కొత్త మేయర్‌గా ఎరిక్ ఆడమ్స్ బాధ్యతలు స్వీకరించారు.ఆయన కూడా కోవిడ్ కట్టడిపై తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే బిల్ డి బ్లాసియో ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ఆడమ్స్ కన్నెర్ర చేశారు.వ్యాక్సిన్ తీసుకోని సుమారు 3 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ఎరిక్ ఆడమ్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తాజా వార్తలు