తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ పృథ్విరాజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఆబ్బె తెలియదండి ఆయన ఎవరు అని అంటారా.
కమెడియన్ పృథ్వీరాజ్ అంటే ఎవరో కాదు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి.ఓ ఆయన గురించి చెబుతున్నారా ఆయన మాకు తెలియక పోవడం ఏంటి ఓకే కంటిన్యూ కంటిన్యూ అంటారా.కాస్త కంటిన్యూ చేస్తే.30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం.సినిమా రంగంలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్న ఆయన కంటూ సపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నారు.సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకుని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు పృద్వి.
30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే ఒకే ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిపోయారు.ఇక ఆ డైలాగ్ ఏకంగా పృధ్విరాజ్ ఇంటి పేరుగా మారిపోయింది.
అయితే కేవలం సినిమా రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా రానిస్తూ ఉన్నారు.ఏపీ ముఖ్య మంత్రి సీఎం జగన్ అభిమానిగా ఉన్న పృథ్వి రాజ్ ఇక వైసీపీ అధికారం లోకి రావాలని ఎంత గానో ప్రచారం కూడా నిర్వహించారు.
ఇకపోతే ఇటీవల ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పు కొచ్చారు పృధ్విరాజ్.తన కెరీర్లో చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను అంటూ చెప్పారు.
అయితే ఈ సమస్యలు ఉన్నప్పుడు తన వెన్నంటే ఉండి ధైర్యం చెప్పి ఆదుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.

అయితే తనకు ఫోన్ చేసి ఒక రోజు షూటింగ్ ఉంది అని చెబుతారని.ఆ రోజు షూటింగ్ లో ఇంటర్వెల్ కు ముందు రెండు సీన్లు ఇంటర్వెల్ తర్వాత రెండు సీన్లు వేసి 20 వేలు ఇచ్చి పంపుతారని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.అయితే అటు బంధువులు మాత్రం రోజుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు వస్తాయని ప్రచారం చేస్తారని చెప్పు కొచ్చారు ఆయన.అయితే తనకు వచ్చిన రెమ్యునరేషన్ లో జిఎస్టి, మేనేజర్ కమిషన్లు ఇతర ఖర్చులు అన్నీ పోయాక మిగిలేది ఏమీ ఉండ దని బయట ప్రచారం మాత్రం మరోలా ఉంటుందని లక్షల రూపాయల పారితోషికం తీసుకొని కోట్లు సంపాదిస్తారు అంటూ ప్రచారం చేస్తారని పృథ్వీరాజ్ తెలిపాడు.







