సింగపూర్ బార్ ఎగ్జామ్‌లో చీటింగ్.. లా ప్రాక్టీస్ నుంచి తప్పుకున్న ముగ్గురు భారత సంతతి ట్రైనీలు

2020లో జరిగిన బార్ పరీక్షల్లో మోసం చేసినట్లు తేలిన తర్వాత సింగపూర్‌లో లా ప్రాక్టీస్ నుంచి ముగ్గురు భారత సంతతి వారితో సహా ఆరుగురు ట్రైనీలు సోమవారం తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారని స్థానిక మీడియా కథనాలను నివేదించింది.నిందితులను మోనిషా దేవరాజ్, కుశాల్ అతుల్ షా, శ్రీరామ్ రవేంద్రన్, మాథ్యూ చౌ జున్ ఫెంగ్, లియోనెల్ వాంగ్ చూంగ్ యోంగ్, లిన్ కుయెక్ యి టింగ్‌లుగా గుర్తించారు.

 3 Indian Origin Trainees Withdrew From Practicing Law Over Singapore Bar Exam Ch-TeluguStop.com

పరీక్షల సందర్భంగా వీరిలో ఐదుగురు వాట్సాప్ ద్వారా ఆరు పరీక్ష పత్రాల సమాధానాలను పంచుకోగా.కుయెక్ మాత్రం మూడు పేపర్లలో మోసం చేసేందుకు మరో అభ్యర్ధితో కుమ్మక్కైనట్లు అధికారులు గుర్తించారు.

నేరం రుజువుకావడంతో తమ బార్ దరఖాస్తులను ఉపసంహరించుకునేందుకు హైకోర్టు న్యాయమూర్తి సోమవారం ఆరుగురికి అనుమతి ఇచ్చారు.

సింగపూర్‌లో లా ప్రాక్టీస్ చేయడానికి.

లా గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా పార్టీ బీ అని పిలవబడే పరీక్షల సెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.సింగపూర్ కోర్టులో న్యాయవాదులు, న్యాయవాదులుగా ప్రవేశానికి న్యాయ విద్య, వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసిన న్యాయ నిపుణులను బార్ సూచిస్తుంది.

కాగా.ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్ చూ హాన్ టెక్ .క్యూక్ బార్ అడ్మిషన్ విచారణను ఒక సంవత్సరానికి , మిగిలిన ఐదుగురు ట్రైనీల విచారణను ఆరు నెలలకు వాయిదా వేశారు.పార్టీ బీ పరీక్షల్లో కాపీ కొట్టినందున ఈ ఆరుగురిలో నిజాయితీ, చిత్తశుద్ధి లోపించిందని .వీరి దరఖాస్తులపై అటార్నీ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Telugu Indianorigin, Lin Kuek Yi, Lionelwong, Matthewchow, Monisha Devaraj-Telug

అటార్నీ జనరల్ నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం… ట్రైనీ లాయర్లపై విచారణను వాయిదా వేయడం వల్ల వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.దేవరాజ్, షా, వాంగ్ తరపున శ్రీనివాసన్ నారాయణన్‌ న్యాయవాదిగా వ్యవహరించారు.ఈ ముగ్గురూ తమ చర్య గురించి లోతైన ఆలోచన చేస్తారని, భవిష్యత్తులో ఏదైనా దరఖాస్తులు చేయడానికి బార్ అడ్మిషన్ల ప్రక్రియలోని ఇతర వాటాదారులను సంప్రదిస్తారని శ్రీనివాసన్ వాదించారు.

అటార్నీ జనరల్, లా సొసైటీ, సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ (ఎస్ఐఎల్ఈ)లను ఈ వాటాదారులుగా ఆయన అభివర్ణించారు.అయితే అటార్నీ జనరల్, లా సొసైటీ, ఎస్ఐఎల్ఈ ప్రతినిధులు ఈ వాదనలను వ్యతిరేకించకపోవడంతో జస్టిస్ చూ.నిందితుల లా ప్రాక్టీస్ దరఖాస్తులను ఉపసంహరించడానికి అనుమతించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube