వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యూఏఈలలో ప్రవాస భారతీయుల ఆధిపత్యం కనిపిస్తుంది.
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హారిస్( Kamala Harris ) బరిలో నిలిచారు.అగ్రరాజ్యానికి ఆనుకుని ఉండే కెనడాలో( Canada ) భారతీయుల ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా అక్కడి బ్రిటీష్ కొలంబియా ప్రావిన్షియల్ ఎన్నికల్లో( British Columbia Provincial Poll ) ఏకంగా 27 మంది భారత సంతతి అభ్యర్ధులు బరిలో నిలిచారు.మొత్తం 93 నియోజకవర్గాలకు గాను అక్టోబర్ 19న పోలింగ్ జరగనుంది.
ప్రావిన్స్‌లోని రెండు ప్రధాన రాజకీయ సంస్థలైన నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) , కన్జర్వేటివ్ పార్టీల నుంచి అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.ఈ రెండు పార్టీలు దక్షిణాసియన్లు , పంజాబీ సంతతి అభ్యర్ధులకు పెద్ద సంఖ్యలో టికెట్లు ఇచ్చాయి.ఎన్టీపీ తన సిట్టింగ్ హౌసింగ్ మంత్రి, ప్రభుత్వ హౌస్ లీడర్ రవి కహ్లాన్‌ను( Ravi Kahlon ) డెల్టా స్థానం నుంచి పోటీకి దింపింది.రాజకీయాల్లోకి రాకముందు ఆయన 2000, 2008 సమ్మర్ ఒలింపిక్స్‌తో సహా అనేక అంతర్జాతీయ ఈవెంట్‌లలో కెనడాకు ప్రాతినిథ్యం వహించారు.
ఎడ్యుకేషన్, శిశు సంరక్షణ మంత్రి రచనా సింగ్( Rachna Singh ) ఎన్డీపీ నుంచి సర్రే నార్త్ నుంచి మూడవసారి ఎన్నికవ్వాలని పట్టుదలతో ఉన్నారు.ఢిల్లీలో పుట్టి చండీగఢ్‌లో పెరిగిన రచనా సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో మనస్తత్వ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.మరో నేత రాజ్ చౌహాన్ బ్రిటీష్ కొలంబియా శాసనసభకు స్పీకర్‌గా పనిచేస్తున్నారు.ఆయన గతంలో 2013 నుంచి 2017 వరకు లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు.2009, 2013, 2017, 2020లలో వరస విజయాలు సాధించి.ఇప్పుడు ఆరోసారి ఎన్‌డీపీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు.
వీరితో పాటు జగ్రూప్ బ్రార్, కమల్ గ్రేవాల్, హర్‌ప్రీత్ బాద్వోల్, హర్విందర్ సంధు, బల్జీత్ ధిల్లాన్, అమన్ సింగ్, అన్నే కాంగ్, రియా అరోరా, నిక్కీ శర్మ , సునీత ధీర్, రవి పర్మార్ , హర్మన్ బంగూ, అవతార్ గిల్, మన్‌దీప్ ధాలివాల్ వంటి భారత సంతతి నేతలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు
.