సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పడం కష్టం.డాన్స్, ఫన్నీ, స్టంట్స్, ఫైట్స్ నుంచి షాకింగ్ సీన్స్ వరకు ఇక్కడ చూడొచ్చు.
వీటిలో కొన్ని సన్నివేశాలు పూర్తిగా కలవరపెడుతున్నాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది.
రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో(social media) వైరల్ గా మారింది.ఇందులో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా లారీ కిందకు వెళ్ళిపోయాడు.
అయితే అతను తప్పించుకున్న తీరు నిజంగా చూడాల్సిందే.దీన్ని బట్టి చూస్తే ఇంతకు ముందు ఇలాంటి రోడ్డు ప్రమాదం ఎవరూ చూసి ఉండరు అని అంటారు.
వైరల్ అవుతున్న వీడియోలో, రహదారిపై వాహనాలు సాఫీగా వెళుతున్నట్లు చూడవచ్చు.అంతా మామూలుగానే జరుగుతోంది.అప్పుడే ఒక ట్రక్కు రోడ్డుపై లెఫ్ట్ లోకి వచ్చి సైడ్ టర్న్ తీసుకుంటుంది.దాని వెనుక మరో ట్రక్ కూడా కనిపించింది.
అది కూడా ఎడమ వైపు మలుపు తీసుకుంటుంది.అయితే ఆ సమయంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ట్రక్కు కిందపడిపోవడంతో షాకింగ్ దృశ్యం కనిపించింది.
అతని బైక్ ట్రక్కు చక్రాల కిందకు వెళ్ళిపోయింది.కానీ అతని అతని అదృష్టం కొద్దీ అతడు బయట పడ్డాడు.
వ్యక్తి హెల్మెట్ ( Helmet) ధరించి ఉండడంతో, కొంత సమయం తర్వాత లేచి నిలబడటం మీరు చూడవచ్చు.ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా ఆ వ్యక్తి ప్రాణాలు ఉండేవి కాదు.

అయితే బైక్ నడుపుతున్న వ్యక్తి ట్రక్కు కిందకు ఎలా వచ్చాడన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.లారీ సైడ్ టర్న్ తీసుకోవడంతో బైకర్ దాని కిందికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.అయితే ఆ బైకర్ ప్రాణాలు ఉండడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు.ఈ వీడియో @gharkekalesh అనే X హ్యాండిల్‌లో పోస్ట్ చేయబడింది.ఇక వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇందులో కొందరు ‘దీనిని బ్లైండ్ స్పాట్ అంటారు’ అని కామెంట్ చేసారు.







