టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో మంది హీరోలు రాణిస్తున్న విషయం తెలిసిందే.చిన్న హీరోల నుంచి అగ్ర హీరోల వరకు చాలామంది హీరోలు రాణిస్తున్నారు.
అయితే వీరిలో టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోలు ఎవరు అన్న విషయాన్ని తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్( Ormax ) వెల్లడించింది.దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది.
తాజాగా డిసెంబర్ 2023కి సంబంధించి తెలుగు టాప్ హీరోల లిస్టును విడుదల చేసింది.అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేధికగా విడుదల చేసింది.
మరి ఏ ఏ స్థానంలో ఏఏ హీరోలు ఉన్నారు అలాగే టాప్ టెన్ లో ఉన్న హీరోలు ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే.ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ వన్ ప్లేస్ లో ప్రభాస్( Prabhas ) ఉన్నారు.సలార్ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తున్న ఈయన మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.ఈ లిస్టులో రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఉన్నారు.
ఇక మూడవ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నిలిచారు.
ఈయన హీరోగా రాబోతున్న పుష్ప 2, 2024ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుండగా ఆయన కూడా ట్రెండింగ్ లోకి వచ్చారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు.( Mahesh Babu ) నాలుగో స్థానికి చేరారు.
తాజాగా ఈయన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఐదో స్థానంలో ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయన కూడా ఒక్క సినిమాలో కనిపించలేదు.గేమ్ ఛేంజర్ తో ఈ ఏడాది వచ్చేందుకు సిద్ధం అవుతుండగా టాప్ 10 హీరోల లిస్టులో 5వ స్థానంలో నిలిచాడు.
పవన్ కల్యాణ్( Pawan kalyan ) ఓజీ సినిమాతో ఈ ఏడాది మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఆరవ స్థానంలోకి చేరుకున్నారు.ఇక 7వ స్థానంలో నాచురల్ స్టార్ నాని( Nani ) ఉన్నారు.ఇటీవలే ఈయన హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇక ఎనిమిదవ స్థానంలో మాస్ మహారాజా రవితేజ( Raviteja ) ఉండగా, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) 9వ స్థానంలో నిలిచాడు.నటసింహం నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) భగవంత్ కేసరి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు.
టాప్ 10 టాలీవుడ్ హీరోలలో బాలయ్య బాబు 10వ స్థానంలో నిలిచాడు.