సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) వచ్చే నెల సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.మహేష్ బాబు మాత్రమే కాకుండా వెంకటేష్, నాగార్జున,( Nagarjuna ) రవితేజ, విజయ్ దేవరకొండ, తేజ సజ్జ, ఇంకా పలువురు సంక్రాంతి పై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కు పోటీ పెద్దగా ఉంటుందని అంతా భావించారు.ఒకానొక సమయంలో గుంటూరు కారం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
కానీ కచ్చితంగా గుంటూరు కారం సినిమా( ( Guntur Karam ) ను సంక్రాంతికి విడుదల చేస్తానంటూ నిర్మాత ప్రకటించాడు.షూటింగ్ మరో వారం పది రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.నాగార్జున నా సామి రంగ సినిమా ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.మరో వారం పది రోజుల్లో షూటింగ్ పూర్తి అవ్వబోతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు.
అయితే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ను సంక్రాంతికి తీసుకు వచ్చే పరిస్థితి లేదు అంటూ దిల్ రాజు కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చింది.ఇక హనుమాన్ సినిమా ను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని గట్టిగా ప్రయత్నించినా కూడా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ మేకర్స్ అనధికారికంగా చెప్పారు.
అంతే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అదే నిజం అయితే సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాలు కేవలం గుంటూరు కారం( Guntur Karam ) మరియు నా సామి రంగ సినిమాలు( Naa Saami Ranga ) మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సంక్రాంతి సినిమా ల విషయం లో మరి కొన్ని రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.