2023 సంక్రాంతి పండుగ కానుకగా ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.తెగింపు, వారసుడు, వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం సినిమాలు ఈ పండుగకు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
ఈ ఐదు సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
ఇప్పటికే ఈ ఐదు సినిమాల ట్రైలర్లు రిలీజయ్యాయి.
ఈ ఐదు సినిమాల ట్రైలర్లలో తెగింపు మూవీ ట్రైలర్ రొటీన్ గానే ఉంది.తెలుగు ప్రేక్షకులకు ఈ ట్రైలర్ ఎక్కువగా నచ్చలేదు.
అయితే క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషిస్తుందని సమాచారం అందుతోంది.తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోంది.
ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఈ సంక్రాంతికి విడుదలవుతున్న మరో పెద్ద సినిమా వారసుడు కాగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎన్నో తెలుగు సినిమాలు గుర్తుకొస్తున్నాయి.ఈ నెల 11వ తేదీన తెగింపు, వారసుడు రిలీజ్ కానుండగా ఈ రెండు సినిమాలు రొటీన్ సినిమాలే అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.కళ్యాణం కమనీయం ట్రైలర్ బాగానే ఉన్నా పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితులు అయితే లేవనే చెప్పాలి.

వీరసింహారెడ్డి ట్రైలర్ బాలయ్య గత సినిమాలలో కొన్ని సినిమాలను గుర్తు చేసేలా ఉన్నా అభిమానులకు కచ్చితంగా నచ్చేలా ఉంది.ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది.క్రాక్ సక్సెస్ తో గోపీచంద్ అఖండ సక్సెస్ తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించేలా ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వాల్తేరు వీరయ్య ట్రైలర్ కూడా మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ట్రైలర్లలో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అని చెప్పలేము.ఈ రెండు సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని ఈ రెండు సినిమాల ఫ్యాన్స్ భావిస్తున్నారు.