ఇటీవల కాలంలో ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ ఎంత స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమాలో హీరో హీరోయిన్ల గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో ఇక ఐటమ్ సాంగ్ లో చేసే హీరోయిన్ గురించి కూడా దర్శకనిర్మాతలు అంతే ఫోకస్ పెడుతున్నారు.
ఇక పుష్ప సినిమాకి సమంత ఐటమ్ సాంగ్ ప్లస్ అయినట్టు ఇక అన్ని సినిమాలకు కూడా ఐటమ్ సాంగ్ ప్లస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ ఏడాది ప్రథమార్ధంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఎన్నో ఐటం సాంగులు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి సినిమా కు ప్లస్ అయ్యాయి అని చెప్పాలి.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగార్రాజు :
వాసి వాడి తస్సదియ్య అంటూ జాతిరత్నాలు బ్యూటీ పారియా అబ్దుల్లా ఇద్దరు అక్కినేని హీరోలతో ఐటమ్ సాంగ్ చేసి స్టెప్పులు వేసింది.ఇక ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే.ఫారియా అబ్దుల్ల ఐటమ్ సాంగ్ తో పాటు బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతికి సూపర్ హిట్ సాధించింది అని చెప్పాలి.

గని :
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ సాంగ్ తో అదరగొట్టేసింది అన్న విషయం తెలిసిందే.కొడితే అంటూ సాగే పాటలు తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో హావభావాలతో ప్రేక్షకులను అలరించింది.ఐటెం సాంగ్ హిట్ అయిన సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.

ఆచార్య :
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమాలో శానా కష్టం వచ్చిందే మందాకిని అనే స్పెషల్ సాంగ్ లో కనిపించింది హాట్ బ్యూటీ రెజీనా కసాండ్రా. ఇక మొదటి సారి ఐటెం సాంగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.అయితే ఈ ఐటెం సాంగ్ హిట్ అయ్యింది కానీ సినిమానే మాత్రం ఫ్లాప్ అయింది.

ఎఫ్ 3 :
ఇప్పటికే ఒక ఐటమ్ సాంగ్ చేసి జిల్ జిల్ జిగేల్ రాణి గా గుర్తింపు సంపాదించుకున్న పూజాహెగ్డే ఇక ఇటీవలే మరో ఐటం సాంగ్ తో అలరించింది.లైఫ్ అంటే మినిమం ఇట్ట ఉండాలా అంటూ సాగిపోయే పాటలో పొట్టి పొట్టి డ్రెస్ లతో తన అందాలతో కనువిందు చేసింది పూజా హెగ్డే.తన క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో కుర్రాళ్ల గుండెలు పిండేసింది అని చెప్పాలి.ఇక ఈ సినిమా హిట్ అయింది.ఐటమ్ సాంగ్ కూడా హిట్ అయింది.