2019 ఏడాదికిగాను బెస్ట్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్ ఏవో ప్రకటించాయి ఆపిల్, గూగుల్.
ఆపిల్‌కు చెందిన యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో యూజర్స్ వేసిన ఓట్ల ప్రకారం ఈ బెస్ట్ యాప్స్‌ను ఎంపిక చేశాయి.
ఆపిల్ విషయానికి వస్తే స్పెక్టర్ (Spectre) ఐఫోన్ యాప్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది.ఐఫోన్ యూజర్స్ లాంగ్ ఎక్స్‌పోజర్ ఉన్న ఫొటోలను తీసుకోవడానికి ఈ యాప్‌ను వాడతారు.
ఆపిల్ యాప్ స్టోర్‌లో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అయితే ఇది ఫ్రీ యాప్ కాదు.రూ.249 చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆబ్లో (Ablo) గూగుల్ ప్లే స్టోర్ యాప్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది.
ఆబ్లో ఒక చాట్ యాప్.ఈ యాప్ ద్వారా ప్రపంచంలోని ఎక్కడి వాళ్లతో అయినా చాట్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే.ఇందులో మెసేజ్‌లు, వీడియో కాల్స్ రియల్ టైమ్‌లో ట్రాన్స్‌లేట్ అవుతాయి.
ఇక స్కై (sky) చిల్డ్రన్ ఆఫ్ ద లైట్ అనే గేమ్ ఐఫోన్ గేమ్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది.టాప్ ఫ్రీ గేమ్స్ ప్రకారం.
మారియో కార్ట్ టూర్ యాప్ స్టోర్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం విశేషం.ఆండ్రాయిడ్ విషయానికి వస్తే కాల్ ఆఫ్ డ్యూటీ గూగుల్ ప్లే స్టోర్ గేమ్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది.
ఆపిల్ యాప్ స్టోర్‌లో టాప్ యాప్స్ జాబితాలో యూట్యూబ్ తొలిస్థానంలో నిలవగా.ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, మెసెంజర్, జీమెయిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy