2018 Movie: 2018 మూవీ ఫ్లాపా.. సినిమా విడుదలై వారం కూడా కాకుండానే ఓటీటీలోకా?

ఈ మధ్యకాలంలో విడుదల అవుతున్న చాలా సినిమాలు థియేటర్లలో కనీసం వారం రోజులు కూడా ఆడకముందే అప్పుడే ఓటీటీ లోకి విడుదల అవుతున్నాయి.దీంతో ప్రేక్షకులు కూడా సినిమా థియేటర్లకు రావడం మానేశారు.

 2018 Movie Ott Release Sony Liv June 7th-TeluguStop.com

ఎలాగో సినిమా విడుదలైన వారం రోజులకి ఓటిటిలో వస్తుంది కదా అన్న ధీమాతో ఓటీటీ లోనే సినిమాను చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.కేవలం యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మాత్రమే కాకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు కనీసం నెలరోజులు కూడా ఆడకముందే అప్పుడే ఓటీటీ లోకి విడుదల అవుతున్నాయి.

Telugu Ott, Sonyliv, Kollywood, Bunny Vas, Sony Liv-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమా విడుదల అయ్యి కనీసం వారం రోజులు కూడా కాకముందే అప్పుడే చిత్ర బృందం ఈ సినిమా ఓటీటీ డేట్ ని ఫిక్స్ చేసింది.ఆ సినిమా ఏంటి? ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.మలయాళంలో విడుదల అయ్యి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 2018.( 2018 Movie ) ఇటీవలే ఈ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన అయ్యి 25 రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఇక టాలీవుడ్‌లో కూడా ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ దక్కింది.ప్రముఖ నిర్మాత బన్నీ వాస్( Producer Bunny Vas ) ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు.

Telugu Ott, Sonyliv, Kollywood, Bunny Vas, Sony Liv-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.అదేమిటంటే ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీలివ్( Sony Liv ) దక్కించుకుంది.ఈ మూవీ జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.థియేటర్ లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ సినిమా విడుదల అయ్యి కనీసం వారం రోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీలోకి విడుదల చేస్తుండడంతో చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ మూవీ ఓటీటీ లో కూడా దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే.మరి ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు సక్సెస్ను సాధిస్తుందో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube