వైరల్: ఇలాంటి కోడి మీకు చచ్చినా దొరకదు... దీని ప్రత్యేకత ఇదే!

అవును, ఇక్కడ మీరు చదివింది నిజమే.పీనట్ (వేరుశెనగ) అనే పేరు గల ఈ కోడి ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది.

ఎందుకంటే ఈ కోడి ప్రపంచలోనే చాలా ప్రత్యేకమైన కోడిగా రికార్డులకెక్కింది.భూమిపై మనుషుల కంటే ఎక్కువగా కోళ్లే ఉన్నాయి అని ఓ సర్వే.

కచ్చితంగా చెప్పాలంటే భూమ్మీద 25 బిలియన్లు కోళ్లున్నట్టు అంచనా.అంటే కోళ్లు కూడా ఇతర పక్షి జాతుల కంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి అని ఇక్కడ మనం అర్ధం చేసుకోవచ్చు.సాధారణంగా కోళ్ల వయసు అనేది చాలా తక్కువగా ఉంటుంది.

అయితే ఈ పీనట్ (వేరుశెనగ) అనే పేరు గల కోడి మాత్రం మనిషి జీవించినట్టే జీవిస్తుంది.అదే దాని ప్రత్యేకత.

Advertisement

మీరు ఈ విశ్వంలో ఇంకా ఎక్కడ వెతికినా ఇలాంటి కోడి కనిపించదు.USA మిచిగాన్‌లోని ఉంటున్న ఈ కోడి 2002 ఏడాదిలో జన్మించింది.ఇది పరిమాణంలో సాధారణ కోళ్ల కంటే చిన్నదిగా ఉంటుంది.

గుడ్లు పెట్టిన తర్వాత పీనట్ తల్లి అన్ని గుడ్లను వదిలివేసింది.దాంతో మెర్సీ డార్విన్ అనే మహిళ ఆ గుడ్లను చూసుకుంది.

పీనట్ గుడ్డు చల్లగా ఉందని.దీంట్లో కోడి పిల్ల బతికే అవకాశం లేదని మెర్సీ అనుకుంది.

కానీ ఆకస్మాత్తుగా ఆ గుడ్డు నుంచి చప్పుడు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది మెర్సీ.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

ఆ తరువాత గుడ్డు పగలకొట్టడంతో.పీనట్ బయటకు వచ్చిందని మెర్సీ డార్విన్ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపింది.అవును, ఇప్పుడు పీనట్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.

Advertisement

కోళ్లు సాధారణంగా 5 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే బతికి ఉండగలవు.కానీ పీనట్ వయసు 20 ఏళ్లు.

ఇప్పటికీ ఈ కోడి ఆరోగ్యంగానే ఉందని ఆమె చెబుతోంది.మార్చి 1, 2023 నాటికి.

ఈ వేరుశెనగ 20 సంవత్సరాల 304 రోజుల వయస్సును పూర్తి చేసింది.దీంతో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన కోడిగా రికార్డు క్రియేట్ చేసింది.

తాజా వార్తలు