బ్రిటన్‌ కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి ఎంపీలకు చోటు.. ఎవరు వారు..?

సర్వే అంచనాలను నిజం చేస్తూ బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన సంగతి తెలిసిందే.తీవ్ర పోటీనిచ్చిన రిషి సునాక్ రెండో స్థానానికి పరిమితమయ్యారు.

 2 Indian Origin Ministers In Uk Pm Liz Truss' New Cabinet , Liz Truss, Alok Sha-TeluguStop.com

ప్రధానిగా ఎన్నికకావడంతో లిజ్ తన కొత్త టీమ్‌పై ఫోకస్ పెట్టారు.దీనిలో భాగంగా సమర్ధులైన వారిని తన కేబినెట్‌లో తీసుకుంటున్నారు.

ఇక లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికైతే .భారత సంతతి ఎంపీలకు ప్రాధాన్యత దక్కదనే ఊహాగానాలకు ఆమె చెక్ పెట్టారు.భారత మూలాలున్న సుయెల్లా బ్రేవర్‌మేన్, అలోక్ శర్మలకు లిజ్ ట్రస్ కొత్త బాధ్యతలు అప్పగించారు.

ప్రధాన మంత్రి రేసులో తాను గెలిస్తే.

దేశంలోని కీలక కార్యాలయాల్లో ఒకటిగా పరిగణించబడే హోమ్ ఆఫీస్‌కి అధిపతిగా నియమిస్తాననే హామీ మేరకు ట్రస్‌కు బ్రేవర్‌మాన్ మద్ధతు పలికారు.దీంతో అన్న మాట ప్రకారం… సుయెల్లాకు హోమ్ సెక్రటరీగా పదోన్నతి కల్పించారు.

అలాగే పోలీస్, ఉగ్రవాద నిరోధకం, ఇంటెలిజెన్స్‌ విభాగాలకు ఆమె సారథ్యం వహిస్తారు.అంతేకాదు.

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన .గడువు ముగిసినా ఇక్కడే వుంటోన్న అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే బాధ్యత కూడా బ్రేవర్‌మాన్‌కే కట్టబెట్టే అవకాశం వుంది.

నార్త్ లండన్‌లోని హారోలో ఏప్రిల్ 3, 1980లో జన్మించారు సుయెల్లా బ్రేవర్‌మాన్ .ఆమె అసలు పేరు స్యూ- ఎల్లెన్ కాసియానా ఫెర్నాండెజ్‌.తండ్రి క్రిస్టీ, తల్లి ఉమా ఫెర్నాండెజ్.వీరిద్దరూ భారత సంతతికి చెందినవారే.వివాహం తర్వాత కెన్యా, మారిషస్‌లలో వున్న ఈ జంట 1960లలో బ్రిటన్‌కు వలస వచ్చారు.ఆమె తల్లి వృత్తి రీత్యా నర్సు.2001 సాధారణ ఎన్నికలలో, 2003 బ్రెంట్ ఈస్ట్ ఉపఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు.బ్రేవర్‌మాన్ తల్లిదండ్రులు హిందువులు.

కానీ ఈమె మాత్రం త్రిరత్న బౌద్ధ సంఘంలో సభ్యురాలు.లండన్ బౌద్ద కేంద్రానికి ఆమె ప్రతి నెలా హాజరవుతారు.

బుద్ధుని సూక్తుల సమాహారమైన ధమ్మపదంపై ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.సుయెల్లా భర్త పేరు రేల్ బ్రేవర్‌మాన్.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

Telugu Indianorigin, Alok Sharma, Bangladesh, India, Liz Truss, Pakistan, Rishi

ఇకపోతే.ఆగ్రాలో జన్మించిన 55 ఏళ్ల అలోక్ శర్మకు యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌లో COP26 అధ్యక్షుడిగా తన క్లైమేట్ యాక్షన్ పోస్ట్‌ను కొనసాగించారు లిజ్ ట్రస్.గతేడాది నవంబర్‌లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన COP26 సమ్మిట్‌లను సమర్ధవంతంగా నిర్వహించిన అలోక్ శర్మ.

ప్రపంచ దేశాధినేతల ప్రశంసలు అందుకున్నారు.తన పదవిని కంటిన్యూ చేయడంపై అలోక్ శర్మ స్పందించారు.

గ్లాస్గో క్లెమేట్ అగ్రిమెంట్‌ను అందించడానికి ప్రధాని లిజ్ ట్రస్‌తో పనిచేయడం చాలా సంతోషంగా వుందని ఆయన ట్వీట్ చేశారు.దక్షిణ ఇంగ్లాండ్‌లోని రీడింగ్ వెస్ట్ నుంచి 2010 నుంచి అలోక్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

నాటి నుంచి వాణిజ్యం , గృహ నిర్మాణం, ఉపాధి విభాగాలలో ఆయన పలు హోదాల్లో పనిచేశారు.బ్రిటన్ కొత్త కేబినెట్‌లో సుయెల్లా, అలోక్‌లకు స్థానం లభించడంపై ఇండియన్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube