శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం.. ఇలా వెళ్తే రెండు గంటల్లోనే..

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తూ ఉంటారు.

గురువారం రోజున దాదాపు 60 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే 22,500 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.

హుండీ ద్వారా భక్తులు కానుకల రూపంలో స్వామివారికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలను సమర్పించారు.ఇక సర్వ దర్శనం భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

14 Hours For Darshanam Of Srivaru ,vaikuntha Q Complex ,sri Venkateswara Swami ,

దీని వల్ల స్వామి వారి సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతుంది.ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది.శ్రీ వారి దేవాలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు అర్చకులు నిర్వహిస్తారు.

Advertisement
14 Hours For Darshanam Of Srivaru ,Vaikuntha Q Complex ,Sri Venkateswara Swami ,

శుక్రవారం ప్రత్యూష కాల ఆరాధనతో దేవాలయా ద్వారాలు తెరిచిన అర్చకులు బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలుకొలుపుతారు.ఆ తర్వాత ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవలను దేవాలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఆ తర్వాత తోమల అర్చన సేవా నిర్వహించిన అర్చకులు ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండల లో శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.

14 Hours For Darshanam Of Srivaru ,vaikuntha Q Complex ,sri Venkateswara Swami ,

సాయంత్రం కాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ నిర్వహించిన తర్వాత నిత్యోత్సవం అర్చకులు నిర్వహిస్తారు.సర్వదర్శనం నిలుపుదల చేసిన తర్వాత శ్రీవారికి రాత్రికి అర్చకులు కైంకర్యాలు మొదలు పెడతారు.తిరిగి సర్వ దర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించి, సర్వ దర్శనం పూర్తయిన తర్వాత ఆగమోక్తంగా శ్రీ వారికి చివరి సేవ అయిన ఏకాంత సేవ ను అర్చకులు నిర్వహిస్తారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు