2022 ఫస్ట్ హాఫ్ కే సెంచరీ కొట్టేసిన టాలీవుడ్.. వివరాలు ఇవే!

2022 ఏడాది వచ్చి అప్పుడే సగం పూర్తి కూడా అయ్యింది.ఏడాది సగం రోజులు గడిచి పోవడంతో ఈ ఆరు నెలలలో మన టాలీవుడ్ ఇండస్ట్రీ సాధించిన ఘనతలు ఏంటి.

 115 Movies Released In Tollywood In First Half Of 2022 Bangarraju Rrr Dj Tillu B-TeluguStop.com

ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.

అయితే ఈ కొత్త ఏడాదిలో టాలీవుడ్ మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఇక్కడ మన సినిమాలకు ప్రేక్షకుల నుండి ఆశాజనకమైన స్పందన లభించింది.

దీంతో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు అనువాద చిత్రాలు కలిపి మొత్తం 115 సినిమాలు రిలీజ్ అయినట్టు లెక్కలు వచ్చాయి.మరి ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి.

మరికొన్ని మొదటి వారం వసూళ్లతో ఇంకొన్ని ఓపెనింగ్స్ తో కుమ్మేసాయి.

సంక్రాంతికి బంగార్రాజు మాత్రమే సినిమా మాత్రమే సూపర్ హిట్ గా మిగిలింది.

మరి భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ఆర్ ఆర్ ఆర్ ఉంది.

Telugu Bangarraju, Bheemla Nayak, Dj Tillu, Kgf Chapter, Radhe Shyam, Tollywood,

రాధేశ్యామ్ మాత్రం అంచనాలు అంతగా అందుకోలేక పోయింది.ఆ తర్వాత డీజే టిల్లు, భీమ్లానాయక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించాయి.అలాగే డబ్బింగ్ సినిమాల్లో కేజిఎఫ్ 2 భారీ కలెక్షన్స్ రాబట్టింది.

Telugu Bangarraju, Bheemla Nayak, Dj Tillu, Kgf Chapter, Radhe Shyam, Tollywood,

ఆచార్య మెప్పించలేక పోగా.సర్కారు వారి పాట మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అలాగే ఎఫ్ 3 సినిమా కామెడీ తో ప్రేక్షకులను మెప్పించింది.ఇలా ఇన్ని సినిమాలు బాగా మెప్పించి మంచి కలెక్షన్స్ రాబట్టగా కొన్ని సినిమాలు నిరాశ కలిగించాయి.

విక్రమ్, మేజర్ సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ సాధించాయి.అంటే సుందరానికి, విరాట పర్వం సినిమాలు పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం సాధించలేక పోయాయి.

ఇలా మొత్తంగా 115 సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube