నాగబాబు పక్కా ప్లాన్.. జబర్దస్త్ నుంచి ఒకొక్కరు బయటకు.. ఇప్పుడు ఈ పరిస్థితి?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా బ్రదర్, యాక్టర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆయన ఎన్నో సినిమాలలో చేసి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Nagababu Pakka Plan One By One Out Of Jabardast And Now This Situation , Nagabab-TeluguStop.com

నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించాడు.ఇప్పటికీ వెండితెరపై పలు సహాయ పాత్రలలో నటిస్తున్నాడు.

కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా జబర్దస్త్, అదిరింది, బొమ్మ అదిరింది అనే కామెడీ షోలో జడ్జిగా కూడా చేశాడు.

వెండితెరపై నటుడిగా 50కి పైగా సినిమాలలో నటించాడు.

నిర్మాతగా ఎనిమిది సినిమాలకు బాధ్యతలు చేపట్టాడు.చివరగా ఆరెంజ్ సినిమాలో నిర్మాత గా బాధ్యతలు చేపట్టగా ఈ సినిమా ఆయనను బాగా నిరాశపరిచింది.

దీంతో ఆ తర్వాత ఈయన నిర్మాతగా బాధ్యతలను వదులుకొని బుల్లి తెర పై వరుస షో లలో జడ్జిగా చేశాడు.

ఇక రాజకీయపరంగా ఈయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరి 2019 నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోక్ సభకు పోటీ చేశాడు.

కానీ ఈయన వైసీపీ, తెలుగుదేశం తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.ఇప్పటికీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయంగా కూడా బాగా యాక్టివ్ గా ఉన్నాడు.ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన నాగబాబుకు ఆ తర్వాత బుల్లితెరపై అంతగా కలిసి రాలేదు.

Telugu Adire Abhi, Apparao, Getup Srinu, Jabardast Show, Janasena, Kirak Rp, Nag

అలా కొంతకాలం బుల్లితెరకు బ్రేక్ ఇవ్వగా మళ్లీ ఈ మధ్య పలు షోలలో, ఈవెంట్లలో దర్శనమిస్తూ బాగా సందడి చేస్తున్నాడు.స్టార్ మా కామెడీ షో లలో కూడా జడ్జిగా చేస్తున్నాడు.ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా.

నాగబాబు సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటాడు.నిత్యం ఏదో ఒక టాపిక్ తో బాగా హల్ చల్ చేస్తాడు.

ఆయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Telugu Adire Abhi, Apparao, Getup Srinu, Jabardast Show, Janasena, Kirak Rp, Nag

ఇదంతా పక్కన పెడితే తాజాగా నాగబాబు గురించి ఒక వార్త బాగా వైరల్ గా మారుతుంది.అదేంటంటే నాగబాబు జబర్దస్త్ లో జడ్జిగా చేసినంత కాలం ఎంతోమంది కమెడియన్స్ ను తన వైపు మలుపుకున్నాడు.ఆ తర్వాత ఆయన అందులోకించి బయటికి రాగా ఆయనతో పాటు పలువురు కమెడియన్లు కూడా బయటికి వచ్చారు.

Telugu Adire Abhi, Apparao, Getup Srinu, Jabardast Show, Janasena, Kirak Rp, Nag

ఇక ఈ మధ్య మాత్రం మరికొంతమంది కమెడియన్లు కూడా జబర్దస్త్ నుండి బయటికి వెళ్లారు.వాళ్ళు ఎవరో కాదు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, కిరాక్ ఆర్ పీ, రాకేష్, అదిరే అభి, అప్పారావు బయటకు వచ్చి లైఫ్ ని స్టార్ట్ చేశారు.ఇక జబర్దస్త్ కి యాంకర్ గా చేసిన అనసూయ కూడా ఇటీవలే స్టార్ మా లో అడుగుపెట్టింది.

దీంతో వీరంతా స్టార్ మా లోనే అడుగుపెట్టడానికి కారణం ఏదో ఉంది అని.ముఖ్యంగా నాగబాబునే వీరందరిని ప్లాన్ చేసి తీసుకొని వచ్చాడని అనుకుంటున్నారు. మొత్తానికి జబర్దస్త్ లో మంచి మంచి కమెడియన్స్ అంతా బయటికి రావటంతో జబర్దస్త్ బాగా దిగజారిపోయింది.

మరి ఈ విషయం గురించి నాగబాబు ఏమని స్పందిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube