యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మున్సిపల్( Mothkur Municipal ) కేంద్రంలో అత్యవసర సేవలైన 108,102 వాహనాలను జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజురుద్దీన్( Nazeeruddin ) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.
అత్యవసర సేవలను సకాలంలో అందజేయాలని సిబ్బందికి సలహాలు సూచనలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పైలెట్లు లాధినేని సోమేశ్వర్,పత్తి సైదులు,ఈఎంటి దినేష్, తొంట భాస్కర్,102 కెప్టెన్ నవీన్ ( Naveen )పాల్గొన్నారు.







