ప్రస్తుతం హమాస్( Hamas ) ఉగ్రవాద సంస్థతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టి పరిస్ధితుల్లోనూ హమాస్‌ను నాశనం చేయాలనే కృత నిశ్చయంతో వున్న ఇజ్రాయెల్ గాజాను దిగ్భంధించింది.
గాజాకు రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది.అయితే ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్( Israel )ను కార్మికు కొరత వేధిస్తోంది.
యుద్ధానికి ముందు గాజా నుంచి ఇజ్రాయెల్‌లో భవన నిర్మాణం, ఇతర పనుల ద్వారా దాదాపు 80 వేల మంది వెస్ట్‌బ్యాంక్‌కు చెందిన పాలస్తీనియన్లు , గాజాకు చెందిన 17 వేల మంది ఉపాధి పొందేవారు.ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్ కమ్మేయడంతో వారికి ఉపాధి కరువైంది.

మరోవైపు.ఇజ్రాయెల్‌కు వర్క్ ఫోర్స్‌ను ఎలా భర్తీ చేయాలనేది నెతన్యాహూ ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకొచ్చింది.ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రభుత్వానికి భారత్ అండగా నిలిచింది.గతేడాది డిసెంబర్‌లో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ..ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi )తో టెలిఫోన్ సంభాషణ జరిపారు.
వీరిద్దరి భేటీలో భారత్ నుంచి కార్మికుల రాక అంశం చర్చకు వచ్చింది.మనదేశానికి చెందిన దాదాపు 10 వేల మంది కార్మికులను యూదు దేశానికి పంపేందుకు న్యూఢిల్లీ ఓకే చెప్పింది.

డిసెంబర్ 27 నుంచి ఢిల్లీ, చెన్నైలలో కార్మికుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలుపెడతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది.ప్రభుత్వం అనుమతించిన మేరకు తొలి విడతలో 10 వేల మందిని నియమించుకుంటామని.ఆపై దానిని 30 వేలకు పెంచుతామని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్( Israel Builders Association ) తెలిపింది.ఈ ప్రక్రియ మొదలై 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనుంది.
ఈ విధంగా మొత్తంగా లక్షా 60 వేల మందిని నియమించుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం యోచిస్తోంది.ఇప్పటికే ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు.అందులోనూ ఎక్కువ మంది హెల్త్ కేర్ విభాగంలోనే సేవలందిస్తున్నారు.తాజా కార్మికుల సంక్షోభం నేపథ్యంలో దాదాపు 42 వేల మంది భారతీయులను నియమించుకునేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగింది.
రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు.వచ్చే వారం రోజుల్లోగా మనదేశం నుంచి 10 వేల మంది కార్మికులు ఇజ్రాయెల్ వెళ్లనున్నారు.







