రూ.100కే జై కొట్టిన భారతీయులు

దేశంలో ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులు ఎక్కువవుతున్నాయి.

చిన్న టీ షాపులో కూడా చకచకా అంతా ఫోన్ పే, గూగుల్ పే, పే టీఎం ద్వారా పేమెంట్లు చేసేస్తున్నారు.

ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నోట్ల చలామణీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్వహించిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.పెద్ద నోటు రూ.2000లకు చలామణీలో డీలా పడినట్లు తెలిసింది.అంతేకాకుండా అత్యధికంగా చలామణీ అయ్యే నోటుగా రూ.500లు నిలిచింది.ఇక రూ.100 నోటుకే ఎక్కువ మంది భారతీయులు జై కొట్టారు.దీంతో భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం ఇదేనని, దేశం పురోగమిస్తోందన్న వాదనలో నిజం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల తన వార్షిక నివేదిక 2021-22 విడుదల చేసింది.డేటా ప్రకారం, భారతీయులలో రూ.100 నోట్లు అత్యంత ఇష్టపడేవి తేలింది.ఇక నాణేలలో రూ.5కు ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు తెలిసింది.అతి తక్కువ మంది రూ.1 నాణేలు కావాలని కోరుకున్నారు.నివేదికలోని డేటా ప్రకారం, చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు 17.3 శాతం నుండి 13.8 శాతానికి పడిపోయాయి.ముఖ్యంగా 2018-19 నుంచి ఆర్‌బీఐ కొత్త రూ.2000 నోట్లను ముద్రించలేదు.ఇప్పుడు చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో ఈ నోట్లు కేవలం 1.6 శాతం మాత్రమే.భారత ఆర్థిక వ్యవస్థలో రూ.500 నోట్లు అత్యధికంగా చలామణి అవుతున్నాయని నివేదిక పేర్కొంది.

2020 మార్చిలో వచ్చిన నివేదికల ప్రకారం, రూ.500, రూ.100 నోట్లు, తక్కువ రూ.2,000 నోట్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎటిఎంలను రీకాలిబ్రేట్ చేస్తోందని వెల్లడైంది.రూ.2000 నోట్లను బ్యాంకులు ఆర్బీఐ వద్ద తమ నిల్వల్లో డిపాజిట్ చేస్తున్నాయి.అయితే, బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Advertisement

ఆర్‌బీఐ ప్రకారం, 2020-21లో మొత్తం చెలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 12,437 కోట్ల నుండి 2021-22 నాటికి 13,053 కోట్లకు పెరిగింది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు