ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు రామ్ పోతినేని.అంతకు ముందు వరకు రామ్ చాకోలెట్ బాయ్ లా యువతకు దగ్గరయ్యి ప్రేమ కథలను మాత్రమే ఎంచుకుని వాటిలో నటిస్తూ వచ్చాడు.
అయితే పూరీ జగన్నాథ్ ఈ లవర్ బాయ్ ను కాస్త మాస్ లుక్ లోకి మార్చి ప్రేక్షకులకు ఇష్మార్ట్ శంకర్ అంటూ కొత్తగా పరిచయం చేసాడు.
ఇక అప్పటి నుండి రామ్ కు తెలుగులో మరింత ఫాలోయింగ్ పెరిగింది.
ఈ సినిమా తర్వాత రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేసాడు.కానీ ఈ సినిమా విజయం సాధించలేదు.
ఈ సినిమాతో తమిళ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ అయితే ఇచ్చాడు కానీ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు.అయితే ఇది థియేట్రికల్ గా ప్లాప్ అయినా యూట్యూబ్ లో మాత్రం సంచలనం క్రియేట్ చేసింది అనే చెప్పాలి.
రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది.మరి ఈ సినిమాను కూడా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది.ఇదే కాదు రామ్ నటించిన 7 సినిమాలు వరుసగా యూట్యూబ్ 100 మిలియన్ వ్యూస్ సాధించాయి.ఇందులో ప్లాప్ సినిమాలు కూడా ఉండడం విశేషం.
గణేష్ సినిమాతో రామ్ హిందీ ఆడియెన్స్ ను మెప్పించిన రామ్ ఆ తర్వాత వరుస సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి.

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, హలొ గురు ప్రేమకోసమే, హైపర్, ఇష్మార్ట్ శంకర్ వంటి సినిమాలకు హిందీ వర్షన్ లో అద్భుతమైన స్పందన లభించింది.ఇలా సోత్ ఇండస్ట్రీలోనే వరుసగా 7 డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న హీరోగా రామ్ రికార్డ్ క్రియేట్ చేసాడు.ఇక ఇప్పుడు రామ్ బోయపాటి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
మరి ఈ సినిమాతో హిందీలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటాడో వైట్ చెయ్యాల్సిందే.







