2022 లో 100 కోట్ల మార్క్ అందుకున్న సినిమాల లిస్టు ఇదే.. ఓసారి చూసేయండి?

ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక సినిమా హిట్ అయ్యిందా ఫ్లాప్ అయ్యిందా అని చెప్పడానికి నేటి రోజుల్లో కలెక్షన్స్ నే ప్రూఫ్ గా చూపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తే అంత బ్లాక్ బస్టర్ హిట్ అని భావిస్తున్నారు.50 రోజుల మహోత్సవం, శతదినోత్సవం లాంటివి అస్సలు పట్టించుకోవడం లేదు.మరి 2022 సంవత్సరంలో 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.2022 లో ఒకే రోజులో వందకోట్లు కొట్టి రికార్డు సృష్టించింది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన కళాఖండం త్రిబుల్ ఆర్.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్లు రాబట్టింది.మొత్తంగా పదకొండు వందల కోట్లకు పైగా వసూలు చేసి అటు నిర్మాతలకు లాభాల పంట పండించింది.

 Tollywood Movies In 100 Crores Tollywood, 100 Crores , Vikram , Rrr , Radhyashya-TeluguStop.com

ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆ మార్కును విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా కూడా అందుకుంది.

ఈ సినిమా వంద కోట్లు అందుకోవడానికి రెండు రోజుల సమయం పట్టింది అని చెప్పాలి.మొదట ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా అటు కలెక్షన్స్ మాత్రం తగ్గేదేలా అన్నట్లుగానే వచ్చాయి.

ఇక మొత్తం 250 కోట్లు సాధించింది ఈ సినిమా.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా సైతం రెండు రోజుల్లో 100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టడం గమనార్హం.

ఇక మొత్తం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా.

Telugu Beast, Prabhas, Radhyashyam, Rajamouli, Tollywood, Tollywood Ups, Vijay,

భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్ రాధేశ్యామ్ వంటి సినిమా సైతం వసూళ్లలో మాత్రం అదరగొట్టింది.2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అదరగొట్టింది అనే చెప్పాలి.ఇక మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్3 సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరడం గమనార్హం.

ఇక ఈ సినిమాకు 100 కోట్లు సాధించేందుకు పది రోజుల సమయం పట్టింది.ఇక కమలహాసన్ విక్రమ్ సినిమా మూడు రోజుల్లో 100 కోట్లు ఎలక్షన్స్ టచ్ చేసింది అనే చెప్పాలి.

కానీ అటు బాలీవుడ్ లో మాత్రం భూల్ బులయ్య సినిమా ఒక్కటే ఈ ఏడాది ఇప్పటి వరకు వంద కోట్లు సాధించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube