దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే కెరీర్ ఎంతగా హైప్ వస్తుందో అందరికి తెల్సిందే. ఉప్పెన సినిమా తో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చి బాబు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది.
ఉప్పెన సినిమా చూసి బుచ్చి బాబుకు ఎంతో మంది అభిమానులు అయ్యి ఉంటారు.ఆ అభిమానులు ఇప్పుడు చాలా బాధ పడుతున్నారు.
ఉప్పెన సినిమా విడుదల అయ్యి ఏడాదికి పైగానే అయ్యింది.ఇప్పటి వరకు తదుపరి సినిమా విషయంలో క్లారిటీ రాలేదు.
ఎన్టీఆర్ తో సినిమా అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది కాని బయటకు అయితే చెప్పలేదు.ఎన్టీఆర్ కూడా బుచ్చి బాబు తో మంచి సంబంధాలు కంటిన్యూ చేస్తున్నాడు.
కనుక ఖచ్చితంగా ఆఫర్ ఇస్తాడని అంతా భావించారు.కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బుచ్చి బాబు మరో సినిమా ను చేస్తే బాగుంటుందేమో అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే బుచ్చి బాబు తో సినిమా కు ఓకే చెప్పిన ఎన్టీఆర్ అంతకు ముందు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేయాలి.ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఎన్టీఆర్ 31 ను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ రెండు సినిమా లు కూడా భారీ సినిమాలు.ఈ రెండు సినిమా లు కూడా చాలా సమయం తీసుకుని చేసే సినిమా లు.కనుక ఖచ్చితంగా బుచ్చి బాబుకు ఎన్టీఆర్ డేట్లు ఇవ్వాలంటే తక్కువలో తక్కువ ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.ఇప్పటికే ఉప్పెన సినిమా విడుదల అయ్యి ఏడాది అయ్యింది.
మరో ఏడాది సినిమా తర్వాత సినిమా ప్రకటిస్తే విడుదల అయ్యే సమయంకు మరో ఏడాది.అంటే మొత్తం గా మూడు సంవత్సరాలు అన్నమాట.
అందుకే బుచ్చి బాబు మరో ప్రాజెక్ట్ చూసుకో అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.







