యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న 0.5 సెల్ఫీ

సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అయినా ప్రస్తుత యువత, టీనేజర్లు వాటిని అనుకరిస్తూ ఉంటారు.తాజాగా యువతను 0.5 సెల్ఫీ బాగా ఆకర్షిస్తోంది.దీనినే అల్ట్రా వైడ్ సెల్ఫీ అని పిలుస్తున్నారు.

 0.5 Selfie Trending On Social Media Details, Selfie, Viral Latest, News Viral, Social Media, Attracting , 0.5 Selfie, Selfie With Ultra Wide Camera, Youth, Social Media Trends, Julia Herzig, 0.5 Selfie Trend-TeluguStop.com

ప్రస్తుతం నెట్టింట ఇది బాగా వైరల్‌గా మారింది.ఏ కొత్త ట్రెండ్ అందరినీ ఆకర్షిస్తోంది.

స్వతహాగా సోషల్ మీడియాలో దీనికి ప్రస్తుతం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఎంతో మంది దీనిని అనుకరిస్తున్నారు.

 0.5 Selfie Trending On Social Media Details, Selfie, Viral Latest, News Viral, Social Media, Attracting , 0.5 Selfie, Selfie With Ultra Wide Camera, Youth, Social Media Trends, Julia Herzig, 0.5 Selfie Trend-యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న 0.5 సెల్ఫీ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా టీనేజర్లు ఈ సరికొత్త ట్రెండ్ పట్ల ఆకర్షితులవుతున్నారు.సాధారణ సెల్ఫీలా కాకుండా వెనుక వైపు ఉండే అల్ట్రావైడ్ కెమెరాతో ఫొటోలు తీసుకోవడం దీని ప్రత్యేకత.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

న్యూయార్క్‌లోని లార్చ్‌మాంట్‌కు చెందిన 22 ఏళ్ల జూలియా హెర్జిగ్‌కు ఏదో కొత్త తరహాగా ప్రయత్నించాలని ఉండేది.తాజాగా ఈ 0.5 సెల్ఫీకి ఆమే ఆద్యురాలు.హెర్జిగ్ ఈ కొత్త తరహా సెల్ఫీలను తీయడం ప్రారంభించింది.ఆమె గత సంవత్సరం ఐఫోన్ 12 ప్రోకి అప్‌గ్రేడ్ చేసినప్పుడు, దాని వెనుక కెమెరాలో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉందని ఆమెకు తెలిసింది.

అయితే సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీలో ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన హెర్జిగ్ తరచూ అలా రియర్ కెమెరాలో ఫొటోలు తీసుకోవడం మొదలు పెట్టింది.

Telugu Selfie, Selfie Trend, Julia Herzig, Selfieultra, Trends, Latest-Latest News - Telugu

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలను పోస్ట్ చేయడం ప్రారంభించింది.దీంతో అలా ఇవి వెలుగులోకి వచ్చాయి.సాంప్రదాయ సెల్ఫీలా కాకుండా వెనుక నుంచి ఈ సరికొత్త సెల్ఫీలు తీసుకోవాలి.సమస్య ఏమిటంటే 0.5 సెల్ఫీ తీసుకోవడం కష్టం.సెల్ఫీ తీసుకునేవారు ప్రతి ఒక్కరినీ ఒక ఫ్రేమ్‌లో అమర్చాలనుకుంటే, వారు తమ చేతులను వీలైనంత దూరంగా మరియు పైకి చాచాలి.

వారు తమ ఫోన్‌ను నుదిటికి స్ట్రైట్‌గా ఉంచాలి.ఇలా తీయడం ఎంతో కష్టం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube