ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు స్వతంత్ర భారత వత్రోత్సవాలను వైభవంగా నిర్వహించిన హైదరాబాద్ మెట్రో రైల్ హెచ్ఎంఆర్ఎల్ మరియు ఎల్ & టీఎంఆర్హెచ్ఎల్ ఆఫీస్ ప్రాంగణాలలో జాతీయ పతాక ఆవిష్కరణ భారతదేశపు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అమరవీరులకు నివాళిగా ఉదయం 11.30 గంటలకు అన్ని రైళ్లనూ 58 సెకన్ల పాటు నిలిపివేశారు నగరంలోని 57 మెట్రో స్టేషన్లలోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అసెంబ్లీ మెట్రోస్టేషను మువన్నెల నేపథ్యంతో ప్రకాశింపజేశారు మువ్వన్నెల జెండాలను స్టేషన్ చుట్టూ అలంకరించడంతో పాటుగా సెల్ఫీ బూత్స్ మరియు అకమ్ , ఎసీవీ నేపథ్యంతో స్టాండీ లను పెట్టారు .
దివ్యాంగులైన విద్యార్థులతో పాటుగా ఇతర పాఠశాలల విద్యార్థులు మెట్రో జాయ్ రైడ్ చేశారు .అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద నృత్య ప్రదర్శనలు మరియు డ్రాయింగ్ ఎగ్జిబిషన్ నిర్వహణ హైదరాబాద్ , ఆగస్టు 16,2022 : హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ( హెచ్ఎంఆర్ఎల్ ) మరియు ఎల్ టీ మెట్రో రైల్ ( హైదరాబాద్ ) లిమిటెడ్లు ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ మరియు స్వతంత్ర భారత వత్రోత్సవ వేడుకలను భారతదేశపు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చేశాయి .ఈ వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలను నేడు నిర్వహించారు .ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ఎఎస్ రెడ్డి హాజరుకాగా గౌరవ అతిథులుగా ఎల్ & టీఎంఆర్చ్ఎల్ ఎండీ సీఈవో శ్రీ కెవీబీ రెడ్డి మరియు హెచ్ఎంఆర్ఎల్ మరియు ఎల్ & టీ ఎంఆర్చ్ఎల్ ప్రతినిధులు అమీర్పేట మెట్రోస్టేషన్ వద్ద హాజరయ్యారు .భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళిగా ఉదయం 11.30 గంటలకు 58 సెకన్ల పాటు అన్నిమెట్రో స్టేషన్లలోనూ రైళ్లను ఆపి , ట్రైన్ లోపల జాతీయ గీతం వినిపించారు .