మూడేళ్లు పూర్తైనా పంపిణీకి నోచుకోని డబుల్ బెడ్ రూం ఇళ్ళు

సూర్యాపేట జిల్లా: మునగాల మండలంలో పలు గ్రామాల్లో నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయినా పేదలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన ఇళ్ళు లేని నిరుపేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ జిల్లా ఇంఛార్జి పిల్లుట్ల శ్రీనివాస్,కోదాడ నియోజకవర్గ ఇంచార్జీ గుండెపంగు రమేష్ లు ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం మునగాల మండలంలోని కలకోవ, కోదండరామాపురం గ్రామాల్లో పర్యటించి,నిర్మాణం పూర్తి చేసుకొని శిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.

అనంతరం మునగాల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ద్వారా పేదల ఆత్మగౌరవ పెంచుతామని ప్రగల్భాలు పలికి,చివరికి నిరుపేదలకు ఇళ్ళు లేకుండా చేసిందని మండిపడ్డారు.

అక్కడక్కడా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్మించిన ఇండ్లను కూడా అర్హులకు పంపిణీ చేయకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేయడంతో అవి నిరుపయోగంగా మారి,చివరికి పిచ్చి చెట్లు మొలిచి,శిథిలావస్థకు చేరుకున్నాయని దుయ్యబట్టారు.దీనితో మండలంలోని పేదవాడికి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని తెలిపారు.

ఇల్లు లేని పేదలు గుడిసెల్లో ఇబ్బందులు పడుతూ కొత్త ఇండ్లు ఎప్పుడిస్తరోనని ఏండ్ల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని అన్నారు.ఇప్పటికే అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు,లబ్ధిదారుల ఎంపికలో అలసత్వం వహిస్తున్నారని,అధికారుల పని తీరుతో కోట్లు పెట్టి కట్టిన ఇళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని,కొందరు మందుబాబులు ఈ ఇండ్లలో సిట్టింగులు వేసి,మందుబాటిళ్లు,సిగరెట్ల డబ్బాలతో వాల్స్​ను,డోర్​లను ఆగమాగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్లు కాసులకు కకుర్తి పడి నాణ్యత లేని ఇండ్లను నిర్మించడం వల్ల అవి పగులు ఏర్పడి కూలిపోయో ప్రమాదం ఉందని వాటిని నిర్మించిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అటువంటి ఇండ్లు నిర్మిస్తున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో అర్హులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ అధ్వర్యంలో ఇళ్ల పంపిణీ చేస్తామని,దాని వల్ల జరుగబోయే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దీనిపై స్పందించిన తహశీల్దార్ కృష్ణ త్వరలోనే ఇండ్లు కేటాయిస్తామని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిడి రవి గౌడ్,కోశాధికారి కందుకూరి ఉపేందర్, టౌన్ ఇంఛార్జి కాంపాటి శ్రావణ్ కుమార్,నాయకులు పాతకోట్ల శ్రీను,మునగాల మండల ఇంఛార్జి రెమిడాల లింగయ్య,రాయిరాల సుమన్,కంభంపాటి సోమయ్య,చిర్రా సైదబాబు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచు తూఫాన్
Advertisement

తాజా వార్తలు