భారత్ లో రికార్డు సృష్టిస్తున్న కరోనా.. ఒక్కరోజే ఎన్ని కేసులంటే..?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.అయితే ఇప్పుడు భారత్ కరోనా కేసుల విషయంలో మరో మెట్టు ఎక్కే దిశగా ముందుకు సాగుతుంది.

ఇక దేశంలో సరికొత్తగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైయ్యాయి.గడించిన 24గంటల్లో 83,341 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ ల సంఖ్య 39,36,748కి చేరింది.తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.

Advertisement

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,096 మంది ఈ మహమ్మారి బారినపడి మృతి చెందారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 68,472కి చేరుకుంది.

ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30,37,15 మంది సంపూర్ణ ఆరోగ్యం నుండి కోలుకొని ఇంటికి చేరుకున్నారు.ఇక ప్రస్తుతం భారత్ లో 8,31,124 కరోనా కేసులు యాక్టివ్‌ ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడిందింది.

ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ఈ వైరస్ బారిన పడకుండా ప్రజలంతా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు