బాబు స్పీడుకి బ్రేకేసే మరో ఆడియో టేపు..

మూలిగే నక్కమీద తాటికాయ పడటం అంటే ఏంటో తెలుసు కదా ఇప్పుడు అదే పరిస్థితి ఏపీ సీఎం చంద్రబాబు కి ఎదురవుతోంది.చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడా లేదనుకుంటుంటున్న తరుణంలో ఓటుకు నోటు కేసు చంద్రబాబు జీవితములో మాయని మచ్చని మిగిల్చింది.

 Chandrababu Ashok Gajapathi Audio Tape1-TeluguStop.com

చంద్రబాబు ని వేలెత్తి చూపించలేని వారు సైతం ఇప్పుడు చంద్రబాబు వైపు చూడటమే కాదు చూసి అపహాస్యం చేసుకునే పరిస్థితికి తెచ్చింది ఓటుకు నోటు కేసు.అయితే

ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మరో ఆడియో టేప్ తలనొప్పిగా మారింది…తాజాగా బయటపడిన ఒక వాయిస్ టేపు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.ఆ ఆడియో టేపులో ఏముందంటే.చంద్రబాబు నాయుడితో “నైస్” గా ఉంటే ఏపీలో ఏ పనైన చాలా సులువుగా అయిపోతుందని ఉంది ఇది మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా టాప్ అధికారులు మాట్లాడుకుంటున్న ఆడియో టేప్ ఒకటి సీబీఐకి చేతికి చిక్కడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది

అయితే ఎప్పుడైతే కేంద్రంతో బాబు కాలు దువ్వారో అప్పుడే చంద్రబాబు పై ఆపరేషన్ మొదలు పెట్టిన కేంద్రం.

పెట్టుబడులలో నియమాలు ఉల్లంఘించారన్న విషయంలో దర్యాప్తుని ప్రారంభించింది.అంతేకాదు ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ అయిన సీబీఐ చేతికే అప్పగించింది.ఎయిర్ ఏషియా సీఈఓ, భారత్ శాఖ సీఈఓ మిట్టూ చందానితో మాట్లాడిన ఆడియో టేప్ సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది…అయితే ఈ టేపులో బాబు తో నైస్ గా ఉంటే ఏ పని అయిన అయిపోతుందని అన్నారని ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని సైతం ప్రచురించడం సంచలనం సృష్టిస్తోంది

ఇదిలాఉంటే టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు విమానాయాన శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్రస్తావన వచ్చిందని.అంతర్జాతీయ రూట్ లైసెన్స్ కోసం ఆ సంస్థ ప్రయత్నించిన సమాయంలో ఈ చర్చ జరిగిందని ఈ కథనం సారాంశం.

ఒకే సంస్థకు చెందిన ఈ ఇద్దరు సీఈఓలు మాట్లాడుకున్నా.వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది…అయితే ఈ విషయంలో చంద్రబాబు ప్రస్తావన వారి మధ్య ఎందుకు వచ్చింది ఏమిటా మర్మ అనేది తెలియాల్సి ఉంది అంటున్నారు.

ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగంగానే సాగుతోందా లేక మరేదన్నా కారణం ఉందా అనే విషయంపై దర్యాప్తు అజరుగుతోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube