టి. పాలిటిక్స్ : కాంగ్రెస్ కు మద్దతుగా జనసేన ?

సుదీర్ఘ రాజకీయ అనుభవం, జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుని జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది.మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణ లో మాత్రం గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతూ రోజు రోజుకి ఆ పార్టీ గ్రాఫ్ తగ్గించే పనిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

 T Politics Janasena Supporting To Congres For Huzur Elections 2-TeluguStop.com

ఇక తెలంగాణ ముందస్తు ఎన్నికల్లోనూ మహాకూటమి పేరుతో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు అన్నిటితో కలిసికట్టుగా ముందుకు వెళ్లినా ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే వచ్చాయి.ఇక అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలకన్నా హీనమైన పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కుంటోంది.

ప్రస్తుతం హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే బాగా వెనుకబడిపోయి ఉన్నట్టు కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని టి.కాంగ్రెస్ నాయకులు డిసైడ్ అయ్యారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ ఇక్కడ గెలిచేందుకు సర్వ శక్తులు వడ్డుతోంది.

అంతే కాదు స్థానికంగా హుజూర్ నగర్ లో మంచి పట్టు ఉన్న సీపీఐ మద్దతు కూడగట్టుకోగలిగింది.ఇక ఉత్తమ్ సతీమణి పద్మావతి సభ్యత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఇప్పుడు కొంచెం మెత్తబడి అక్కడ ప్రచారం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సీటు ప్రతిష్ఠాత్మకంగా మారండంతో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు సిద్దం చేసుకుంటోంది.తెలంగాణాలో జనసేనకు పట్టు లేకపోయినా ఆ పార్టీ అధినేత జగన్ కు యూత్‌లో మంచి పట్టు ఉండడంతో ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు చూస్తోంది.

ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరావు ఈ మేరకు జనసేన కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలకు వినతిపత్రం అందజేశారు.

Telugu Huzurnagar, Janasena, Pawan Kalyan, Revanth Reddy, Congress, Utham Kumar-

అయితే ప్రస్తుతం పవన్ స్థానికంగా అందుబాటులో లేడు.వెన్నునొప్పి కారణంగా ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాడు.దీంతో జనసేన కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే విషయంలో స్పష్టమైన క్లారిటీ రాలేదు.

కానీ కాంగ్రెస్ కు జనసేనాని మద్దతు లభిస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది.ఒకవేళ జనసేన కాంగ్రెస్‌కు మద్దతునిస్తే హుజూర్‌నగర్ లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీతో పవన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పవన్ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం, ఆ తరువాత నుంచి కాంగ్రెస్ నాయకులతో పవన్ సన్నిహిత సంబంధాలు జరపడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అన్నీ కుదిరితే పవన్ తో హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube