జగన్‌కు షాక్‌ ఇచ్చిన వీరాభిమాని

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని చూశారా? తన బూట్లతో తాను కొట్టుకుంటున్న ఇతని పేరు రాజమాణిక్యం.చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కె.

పట్నం గ్రామానికి చెందిన వ్యక్తి.ఇతడు వైఎస్‌కు వీరాభిమాని.

ఎంత అభిమానం అంటే ఆయన చనిపోయిన తర్వాత సొంతూళ్లో తన ఇల్లు అమ్మి వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేయించాడు.అంతటి అభిమానం ఉన్న వ్యక్తి సహజంగానే జగన్‌ సీఎం కావాలని ఆకాంక్షించారు.

ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకూ జుట్టు కూడా తీయనని పంతం పట్టారు.అన్నట్లుగానే జగన్‌ అధికారంలోకి వచ్చే వరకూ అలాగే ఉన్నాడు.

Advertisement
Rajamanikyam Not To Get The Pension From MRO Office Telugu-జగన్‌క�

అలాంటి వీరాభిమాని ఇప్పుడు జగన్‌కు ఎందుకు ఓటు వేశానా అని ఇలా నడిరోడ్డుపై చెప్పుతో కొట్టుకుంటున్నాడు.రాజమాణిక్యం పుట్టుకతోనే దివ్యాంగుడు.

కానీ ఇప్పటి వరకూ అతనికి వికలాంగుల పెన్షన్‌గానీ, తెల్ల రేషన్‌ కార్డుగానీ రాలేదు.సోమవారం కూడా స్పందన కార్యక్రమం జరిగితే తన గోడు చెప్పుకోవడానికి వెళ్లాడు.

కానీ స్థానిక మండల వైసీపీ కన్వీనర్‌ ప్రతాప్‌రెడ్డి చెప్తేనే ఇస్తానని తహసీల్దార్‌ తేల్చి చెప్పారు.దీంతో ఏం చేయాలో తెలియక ఇలా బూట్లతో కొట్టుకుంటూ తిరిగి వెళ్లిపోయాడు.

Rajamanikyam Not To Get The Pension From Mro Office Telugu

పార్టీపై ఇంతటి అభిమానం చూపించినా తనకు కనీసం పెన్షన్‌, తెల్ల రేషన్‌ కార్డు దక్కడం లేదని రాజమాణిక్యం వాపోతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది వైసీపీ అభిమానులు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని చెప్పులతో కొట్టుకోవడం చూశాం.కానీ తొలిసారి వైఎస్‌ కుటుంబంపై ఇంత అభిమానం చూపించే వ్యక్తి కూడా పబ్లిగ్గా బూట్లతో కొట్టుకోవడం విశేషం.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు