ఎయిర్ స్ట్రైక్ కేవలం మోడీ ఎలక్షన్ స్టంట్! మరో సారి సిద్దూ వివాదాస్పద వాఖ్యలు!

పుల్వామా దాడి తర్వాత, కాంగ్రెస్ పార్టీ లీడర్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాస్తా వివాదాస్పద వాఖ్యలతో పాకిస్తాన్ ని వెనకేసుకొని వచ్చి అందరితో చివాట్లు తిన్నాడు.

పుల్వామా దాడిపై పాకిస్తాన్ ని విమర్శించడం పద్ధతి కాదని చెప్పడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అతని మీద దాడి జరిగింది.

అయితే ఆ తరువాత సిద్దూ తన వాఖ్యల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కాని క్షమాపణ చెప్పుకోవడం కాని చేయలేదు.అయితే ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ తర్వాత తాజాగా మరో సారి అలాంటి వివాదాస్పద వాఖ్యలు సిద్దూ చేసాడు.

ఉగ్రవాద స్థావరాలపై దాడిలో మూడు వందల మంది టెర్రరిస్ట్ లు చనిపోయారని అంటున్నారు.అసలు అది ఎంత వరకు నిజమో తెలీదు.

ఎలాంటి ఆధారాలు లేవు.పోనీ ఆ ఉగ్ర దాడితో టెర్రరిస్ట్ లని మొత్తం లేకుండా చేయగలిగారా అంటే అది కూడా లేదు.

Advertisement

ఈ ఎయిర్ స్ట్రైక్ అంతా కేవలం మోడీ ఎన్నికలలో గెలవడానికి వేసిన ఒక గిమ్మిక్కు మాత్రమె.దీని వలన ఎలాంటి ప్రయోజనం లేదు.

మోడీ తన రాజకీయాల కోసం ఆర్మీని సైతం వాడేస్తున్నాడు అంటూ సిద్దు ట్విట్టర్ లో విమర్శలు చేసాడు.సిద్దు చేసిన విమర్శలపై నెటిజన్స్ మరో సారి సోషల్ మీడియాలో అతని మీద విమర్శలు చేస్తున్నారు.

సైనికుల పోరాటాన్ని కూడా ఇంతగా హేళన చేయడం నీకే సాధ్యం అవుతుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు