మెగా హీరో ‘రేయ్’ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.
దాంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు.అయితే సినిమా విడుదలకు ముందు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవనిజం సాంగ్‌ను పెట్టబోతున్నట్లుగా ప్రకటించిన చౌదరి తీరా సినిమాలో పట్టకుండా మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పర్చాడు.
ఆశ పెట్టి ఒట్టిదే చేశాడంటూ చౌదరిపై ఆరోపణలు చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత అంటే నేడు ఈ సినిమాలో పవనిజం సాంగ్‌ను యాడ్ చేయబోతున్నట్లుగా దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ప్రకటించాడు.
ఈ పాట చేర్చడంతో మళ్లీ కలెక్షన్స్ పెరుగుతుతాయనే నమ్మకంతో ఈయన కాస్త ఆలస్యంగా ఈ పాటను సినిమాకు చేర్చుతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ నిరాశజనకంగా ఉన్నాయి.
మరి పవనిజం సాంగ్ అయినా ఈ సినిమా కలెక్షన్స్‌లో కదలిక తెస్తాయేమో చూడాలి.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.