ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వైఎస్ఆర్ పార్టీ నేత, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలవనున్నారు.తన పార్టీ ఎంపీలతో కలిసి ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో కలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు .ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి విధిగా ఇవ్వవలసిన నిధుల అంశాలను వివరంగా నివేదిస్తారు.విభజన సమయంలో అప్పటి కేంద్రం ఇచ్చిన హామీలు, రాజధాని నిర్మించుకోవడానికి ప్రత్యెక నిధులు గురుంచి పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ అంశాలపై ప్రధాని మోదీతో వైఎస్ జగన్ ఒకింత సేపు పూర్తి వివరాలు సమర్పిస్తూ చర్చిస్తారు అని ఆ పార్టీ తెలియచేసింది .దీనిపై టిడిపి విమర్శలతో ఎలుగెత్తింది .జగన్ కలుస్తున్నది మోడీ కనుసన్నల్లో తన పనులు చక్కబెట్టేందుకు .ఇక్కడ రాష్ట్రం లో, శాసన సభలో టిడిపి సర్కార్ ఏమి చేసినా తప్పు అని చెబుతూ మోకాలు అడ్డుతూ తను లభ్ధి పొందేందుకు డిల్లీ టూర్లు వేస్తున్నాడు అని దుయ్యబట్టారు .
తాజా వార్తలు