ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ మధ్య సమస్య ఏంటి ?-What Is The Problem Between NTR And Puri Jagannath? 3 months

Kalyan Ram No Announcement Ntr Movie Puri Jagannadh ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ మధ్య సమస్య ఏంటి ? Photo,Image,Pics-

నిన్న ఇజం ఆడియో ఫంక్షన్ జరగడంతో, వేదికపై ఎన్టీఆర్ -.పూరి జగన్నాథ్ ఉండటంతో కొత్త సినిమా గురించి ఏదైనా ప్రకటన ఉంటుందేమో అని అనుకున్నారంతా. కాని అలాంటిదేమి జరగలేదు. ఫంక్షన్ పెద్దగా చేస్తే ఫ్యాన్స్ వస్తారు కాబట్టి, అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కాబట్టి, ఇప్పట్లో ప్రకటించే ఉద్దేశ్యం లేదు కాబట్టే, నిన్న ఇజం ఆడియో ఫంక్షన్ చిన్నగా చేసారని టాక్. మరి పూరి జగన్నాథ్ తో ఎన్టీఆర్ సినిమా ఉన్నట్టా లేనట్టా? అసలు ఎన్టీఆర్ – పూరి మధ్య ఏం జరుగుతోంది?

సినిమా క్యాన్సల్ అవలేదు. ఆంధ్రవాలా, టెంపర్ తరువాత, వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుంది. కాని పూరి రాసుకుంటున్న కథ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదట. ఇదొక్కటో ఇప్పుడున్న సమస్య. అందుకే ఎన్టీఆర్‌ ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ముందే సినిమా ప్రకటించి, ఆ తరువాత కథ పూర్తిగా నచ్చకపోతే బాగుండదని, అందుకే కథ పూర్తిగా సిద్ధంగా ఉండి, అది నచ్చాకే, ఓ ప్రకటన విడుదల చేయాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

సో, ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏంటీ, ఎవరితో అనే విషయంపై ఇప్పుడే ఓ కన్ఫర్మేషన్ కి రాలేమన్నమాట. ఇంకొన్నిరోజులు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఆలస్యం జరిగినా, మరో టెంపర్ లాంటి సినిమా పడితే యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి ఆనందమే కదా!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. పాపం త్రిషని ముప్పుతిప్పలు పెట్టారుగా

About This Post..ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ మధ్య సమస్య ఏంటి ?

This Post provides detail information about ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ మధ్య సమస్య ఏంటి ? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Kalyan Ram, ISm Audio Launch, Puri Jagannadh, Ntr Movie, No announcement, ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ మధ్య సమస్య ఏంటి ?

Tagged with:Kalyan Ram, ISm Audio Launch, Puri Jagannadh, Ntr Movie, No announcement, ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ మధ్య సమస్య ఏంటి ?ISM Audio Launch,kalyan ram,No announcement,NTR Movie,puri jagannadh,ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ మధ్య సమస్య ఏంటి ?,,