డిల్లీ మొత్తాన్ని లేపెస్తాం - పాకిస్తాన్ హెచ్చరిక

పాకిస్థాన్ తలచుకుంటే, రావల్పిండికి సమీపంలోని కహుతా ప్రాంతం నుంచి భారత రాజధాని న్యూఢిల్లీని లక్ష్యంగా చేసుకుని అణ్వాయుధాలను ప్రయోగించగలదని, ఆ బాంబు 5 నిమిషాల్లోనే లక్ష్యాన్ని తాకి పెను విధ్వంసం సృష్టిస్తుందని పాక్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ వెల్లడించారు.ఇరాన్, సిరియా, నార్త్ కొరియా దేశాలకు పాక్ అణు రహస్యాలను చేరవేశాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన, పాక్ తొలి అణుపరీక్షల వార్షికోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

1998లో పాక్ తొలిసారిగా ఖాదిర్ నేతృత్వంలో అణు పరీక్షలు జరిపిన సంగతి తెలిసిందే.పాక్ వద్ద 1984 నాటికే అణు శక్తి సమకూరేదని, అయితే దాన్ని అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు అప్పటి అధ్యక్షుడు జియా ఉల్ హక్ అంగీకరించలేదని తెలిపారు.

తమ భూభాగం నుంచి న్యూఢిల్లీ, ముంబై సహా భారత్ లోని ఏ పట్టణాన్నైనా అణుబాంబులతో నాశనం చేయగలమని ఖాదిర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు