పవన్ ఎన్టీఆర్ ను ఓడించిన వరుణ్ తేజ్

ఓవర్సీస్ మార్కెట్ ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తుందో చెప్పలేం.ఇక్కడ హీరో అయిన వారు అక్కడ జీరో అవొచ్చు.

ఉదాహరణకి చెప్పాలంటే బోయపాటి శ్రీను సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో దంచితే, ఓవర్సీస్ లో మాత్రం తుస్సుమంటాయి.పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ ల సినిమాలు కూడా అంతే.

శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను .ఇద్దరిలో పెద్ద మార్కెట్ ఉన్న దర్శకుడు ఎవరు అంటే వెంటనే బోయపాటి అనేస్తాం .కాని ఓవర్సీస్ వరకు అతిపెద్ద బ్రాండ్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల.రాజమౌళి, త్రివిక్రమ్ తరువాత అక్కడ క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఆయనే.

ఈ స్టేట్మెంట్ కి ఫిదా ఓ రుజువు.ఇంతింతై వటుడింతై అన్నట్టు, చిన్న సినిమా కాస్త పెద్దగా మారింది.

Advertisement

ఓవర్సీస్ లో మాత్రమె కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదరగోట్టింది.ఇక అమెరికాలో అయితే ఆ రేంజ్ వేరు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా అత్తారింటికి దారేది.ఎన్టీఆర్ కెరీర్ లో ఓవరాల్ గా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా జనతా గ్యారేజ్.

ఈ రెండిటిని అమెరికాలో దాటేసింది ఫిదా.మరో విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక ఓవర్సీస్ కలెక్షన్లు సాధించిన నాన్నకు ప్రేమతో చిత్రానికి కూడా ఎంతో దూరంలో లేదు ఫిదా.అమెరికాలో టాప్ 20 చిత్రాలేంటో చూడండి.: 1) Baahubali-The Conclusion : $21M 2) Baahubali-The Beginning : $8.46M 3) Srimanthudu : $2.89M 4) A Aa - $2.49M 5) Khaidi No 150 : $2.44M 6) Nannaku Prematho : $2.02M

7) Fidaa : 1.91M (ఇంకా ఆడుతోంది)

8) Attharintiki Daaredi : $1.89M 9) Janatha Garage : $1.80M 10) Gautamiputra Satakarni : $1.66M 11) SVSC: $1.63M 12) Oopiri : $1.61M 13) Dookudu : $1.56 M 14) Manam : $1.53M 15) Aagadu : $1.48M 16) Dhruva : $1.47M 17) Bhale Bhale Mogadivoy : $1.43M 18) Race Gurram : $1.39M 19) 1 Nenokkadine : $1.33M 20) Baadshah : $1.27M.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు